బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ భాగంగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టెస్ట్‌ను టీమిండియా ఈ ఏడాది ఓటమితో ముగించింది. ఇక ఇదే సిరీస్‌లో చివరి టెస్ట్ (ఐదో టెస్టు)తో 2025కు వెల్‌కమ్ చెప్పనుంది. జనవరి 3న ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొత్తంగా 2024 ఏడాదిలో టీమిండియా ఎన్నో విజయాలు, అపజయాలతో దూసుకుపోయింది. మరి 2025లో టీమిండియా ఎన్ని మ్యాచ్‌లు ఆడుతుంది?.. ఎవరెవరితో ఆడుతుంది?.. ఎప్పుడు ఆడుతుంది? అనే పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పుడు వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం. మొదట భారత్ VS ఇంగ్లాండ్ మధ్య టీ20 సిరీస్ జరగనుంది. ఆ తర్వాత భారత్ VS ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరగనుంది. ఈ రెండు సిరీస్‌ల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ ఆడనుంది. ఇది కూడా చూడండి: మజ్జిగలో కొన్ని కలిపి తాగితే వ్యాధులు మాయం అనంతరం ఐపీఎల్ 2025 ఉంటుంది. ఆపై భారత్ ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లాండ్‌కు వెళ్లనుంది. వీటి తర్వాత వెస్టిండీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా టీమ్‌లతో పలు మ్యాచ్‌లు ఆడనుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత్ vs ఇంగ్లాండ్ T20 సిరీస్ ఫస్ట్ T20 - జనవరి 22 న - కోల్‌కతాలో సెకండ్ T20 - జనవరి 25 న - చెన్నైలో థర్డ్ T20 - జనవరి 28 న - రాజ్‌కోట్‌లో ఫోర్త్ T20 - జనవరి 31 న - పుణెలో ఫిప్త్ T20 - ఫిబ్రవరి 02 న - ముంబైలో జరగనున్నాయి. భారత్ vs ఇంగ్లాండ్ వన్డే సిరీస్ ఇది కూడా చూడండి: 2024లో కనిపించని పెద్ద హీరోలు ఫస్ట్ వన్డే - ఫిబ్రవరి 6న - నాగ్పూర్లోసెకండ్ వన్డే - ఫిబ్రవరి 9న - కటక్లోథర్డ్ వన్డే - ఫిబ్రవరి 12న - అహ్మదాబాద్‌లో భారత్ జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 20న - బంగ్లాదేశ్‌తో మ్యాచ్ - దుబాయ్లోఫిబ్రవరి 23న - పాకిస్థాన్‌తో మ్యాచ్ - దుబాయ్లోమార్చి 2న - న్యూజిలాండ్‌తో మ్యాచ్ - దుబాయ్‌లో ఈ ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ఐపీఎల్ 2025 మార్చి 14 నుంచి మే 25 వరకు ఉంటుంది. ఆ తర్వాత 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఉంటుంది. దీని కోసం భారత్.. ఇంగ్లాండ్ వెళ్లనుంది. జూన్ 20 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఇది కూడా చూడండి: పోలీస్ స్టేషన్‌లోనే ఎస్‌ఐపై దాడి భారత్ vs ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఫస్ట్ టెస్టు - జూన్ 20 - 24 - హెడ్డింగ్లీలోసెకండ్ టెస్టు - జులై 2 - 6 - ఎడ్జ్‌బాస్టన్‌లో థర్డ్ టెస్టు - జులై 10 - 14 - లార్డ్స్లోఫోర్త్ టెస్ట్ - జూలై 23-27 - మాంచెస్టర్‌లో ఫిఫ్త్ టెస్టు - జులై 31 - ఆగస్టు 4 - ఓవల్‌లో జరగనుంది. ఇది కూడా చూడండి: జనవరి 1 నుంచి ఈ 3 రకాల బ్యాంక్ అకౌంట్లు మూతపడనున్నాయి..వీటిలో మీ అకౌంట్ ఉందా చూసుకోండి మరి! వీటి అనంతరం పలు దేశాల టీమ్‌లతో భారత్ జట్టు మ్యాచ్‌లు ఆడనుంది. అయితే వాటికి సంబంధించిన గ్రౌండ్స్ అండ్ తేదీలు ఇంకా వెల్లడికాలేదు. ఇంగ్లాండ్‌తో ఈ టెస్ట్ సిరీస్ అనంతరం భారత్ స్వదేశంలో సౌతాఫ్రికాతో రెండు టెస్టులు, వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో మూడు వన్డే మ్యాచ్‌లు భారత్ ఆడనుంది. వీటితో పాటు టీ20లు కూడా చాలా ఉన్నాయి. బంగ్లాదేశ్‌లో 3 టీ20లు ఆడనుంది. అలాగే ఆసియా కప్ ఒకటి ఉంది. ఇంకా ఆస్ట్రేలియాలో 5 టీ20లు ఆడనుంది. అంతేకాకుండా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 5 టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.