Cricket : టీమ్‌ ఇండియాకు బిగ్ షాక్.. తండ్రి మరణంతో స్వదేశానికి..

ఛాంపియన్స్‌ ట్రోఫీకు ముందు టీమ్‌ఇండియాకు బిగ్ షాక్ తగిలింది.  తన తండ్రి మరణంతో టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ స్వదేశానికి వెళ్లినట్లు సమాచారం. మోర్కెల్ ఫిబ్రవరి 15న భారత జట్టుతో దుబాయ్ కు వచ్చాడు.

New Update
india coach

ఛాంపియన్స్‌ ట్రోఫీకు ముందు టీమ్‌ఇండియాకు బిగ్ షాక్ తగిలింది.  తన తండ్రి  ఆల్బర్ట్ మోర్కెల్ మరణంతో టీమ్‌ఇండియా బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ తన స్వదేశమైన దక్షిణాఫ్రికాకు వెళ్లినట్లు సమాచారం. సోమవారం భారత జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో మోర్నే మోర్కెల్ లేడు. మోర్కెల్ ఫిబ్రవరి 15న భారత జట్టుతో దుబాయ్ కు వచ్చాడు. జట్టు బౌలర్లతో టోర్నమెంట్ వ్యూహాలపై కూడా చర్చించారు.  ఇంతలోనే తండ్రి మరణ వార్త వినగానే హుటాహుటిన తన స్వదేశానికి బయలుదేరాడు.మోర్కెల్ ఎప్పుడు జట్టులోకి తిరిగి వస్తాడో అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఛాంపియన్స్ ట్రోఫీ మందు  దుబాయ్ చేరుకున్న భారత జట్టుకు బౌలింగ్ వ్యూహాల పరంగా మోర్నీ మోర్కెల్‌ లేకపోవడం అనేది పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ బుధవారం నుండి ప్రారంభం కానుంది. ఫిబ్రవరి 20న భారత జట్టు బంగ్లాదేశ్‌తో తన తొలి మ్యాచ్ ఆడనుంది. ఫిబ్రవరి 23వ తేదీన పాకిస్తాన్ తో ఆడనుంది. దీని తర్వాత భారత జట్టు న్యూజిలాండ్‌తో తలపడుతుంది. 

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి మరియు కుల్దీప్ యాదవ్.

ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్...


ఫిబ్రవరి 19 - పాకిస్తాన్ vs న్యూజిలాండ్, కరాచీ
ఫిబ్రవరి 20 - బంగ్లాదేశ్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 21 - ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా, కరాచీ
ఫిబ్రవరి 22 - ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 23 - పాకిస్తాన్ vs ఇండియా, దుబాయ్
ఫిబ్రవరి 24 - బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్, రావల్పిండి
ఫిబ్రవరి 25 - ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా, రావల్పిండి
ఫిబ్రవరి 26 - ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్, లాహోర్
ఫిబ్రవరి 27 - పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, రావల్పిండి
ఫిబ్రవరి 28 - ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా, లాహోర్
మార్చి 1 - దక్షిణాఫ్రికా vs ఇంగ్లాండ్, కరాచీ
మార్చి 2 - న్యూజిలాండ్ vs ఇండియా, దుబాయ్
మార్చి 4 - సెమీ-ఫైనల్-1, దుబాయ్
మార్చి 5 - సెమీ-ఫైనల్-2, లాహోర్
మార్చి 9 - ఫైనల్, లాహోర్ (భారత్ ఫైనల్‌కు చేరుకుంటే దుబాయ్‌లో ఆడతారు)
మార్చి 10 - రిజర్వ్ డే

Also Read :  IND vs PAK: భారత్ను చూసి బుద్దితెచ్చుకో .. టీమిండియా జెర్సీ పై పాకిస్తాన్ పేరు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు