Ind Vs Ire: తొలి వన్డే భారత్‌దే.. అదరగొట్టిన అమ్మాయిలు!

ఐర్లాండ్‌తో మొదలైన మూడు వన్డేల సిరీస్‌లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో టీమ్ ఇండియా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐర్లాండ్ విధించిన 239 పరుగుల లక్ష్యాన్ని 34.3 ఓవర్లలో అలవోకగా ఛేదించింది. 

New Update
ind vs ire

IND-W vs IRE-W 1st ODI India Won

Ind Vs Ire: భారత్‌- ఐర్లాండ్‌ మధ్య మొదలైన మొదటి మ్యాచ్‌లో ఇండియా ఉమెన్స్ టీమ్ ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఐర్లాండ్ విధించిన 239 పరుగుల లక్ష్యాన్ని 34.3 ఓవర్లలో అలవోకగా ఛేదించింది. 

అదరగొట్టిన భారత బ్యాటర్లు..

ఇక భారత బ్యాటర్లలో ప్రతీక రావల్‌ (89; 10×4, 6×1), తేజల్‌ (53*; 9×4) అర్ధ శతకాలతో రాణించారు. కెప్టెన్ స్మృతి మంధాన (41) టీమ్ విజయంలో కీలక పాత్ర పోషించింది. హర్లీన్‌ డియోల్‌ (20) చివర్లో అదరగొట్టింది. ఇక ఐర్లాండ్‌ బౌలర్లలో మాగ్వైర్‌ 3 వికెట్లు, ఫ్రెయా ఒక వికెట్‌ పడగొట్టారు. 

ఓటమి ఎరుగని ఇండియా..

మొదట బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 రన్స్ చేసింది. గాబీ లూయిస్ (92), లేహ్ పాల్ (59) అర్థసెంచరీలతో రాణించారు. సారా 9, ఉనా 5, ఓర్లా 9, లారా డెలానీ డకౌట్, కౌల్టర్ 15, డెంప్సీ 6 పరుగులకే పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో ప్రియా మిశ్రా 2, టిటాస్ సధు, సయాలి, దీప్తి శర్మ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. ఐర్లాండ్‌తో ఇప్పటిదాకా 12 వన్డేలు ఆడిన ఇండియా ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు. ఇక రెగ్యులర్‌ కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌కు విశ్రాంతినివ్వడంతో స్మృతి మంధాన కెప్టెన్ గా జట్టును నడిపిస్దోంది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు