Gujarat: ప్రముఖ క్రికెటర్లకు సీఐడీ సమన్లు?

పోంజీ కుంభకోణం కేసులో నలుగురు క్రికెటర్లకు గుజరాత్ సీఐడీ సమన్లు పంపనుంది. బీజెడ్ గ్రూప్‌లోని రూ.450 కోట్ల లావాదేవీలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే శుభమాన్ గిల్‌తో పాటు మరో ముగ్గురు క్రికెటర్లకు పంపనుంది. వీరు బీజెడ్ గ్రూప్‌లో పెట్టుబడి పెట్టారట.

New Update
NOTICES

NOTICES Photograph: (NOTICES)

దేశవ్యాప్తంగా పోంజీ కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామని బీజెడ్ గ్రూప్‌ పేరుతో దాదాపు రూ.6 వేల కోట్ల కుంభకోణం గుజరాత్‌లో జరిగింది. ఈ కేసుకి సంబంధించి బీజెడ్ గ్రూప్ సీఈఓ భూపేంద్ర సింగ్ ఝలాను సీఐడీ అరెస్టు చేసింది. అయితే ఈ కుంభకోణానికి సంబంధించి నలుగురు భారత క్రికెటర్లకు పోలీసులు సమన్లు పంపనున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: AP JOBS: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

ఇది కూడా చూడండి:Air India: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

శుభమాన్ గిల్‌తో పాటు పలువురు క్రికెటర్లకు..

శుభమాన్ గిల్‌తో పాటు మోహిత్ శర్మ, రాహుల్ తెవాటియా, ఆర్ సాయి సుదర్శన్‌లకు కూడా గుజరాత్ సీఐడీ క్రైంబ్రాంచ్ పోలీసులు సమన్లు పంపనున్నారు. వీరు నలుగురు కూడా ఇందులో పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. గిల్ ఇందులో రూ.1.95 కోట్లు పెట్టుబడి పెట్టారు. బీజెడ్ గ్రూప్‌‌కి సంబంధించి రూ.450 కోట్ల లావాదేవీలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే వీరికి సమన్లు పంపనున్నట్లు తెలుస్తోంది. 

ఇది కూడా చూడండి:TS: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు