IND vs PAK: పాక్‌పై భారత్ ఘనవిజయం

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాక్‌పై ఘన విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 42.3 ఓవర్లలో 242 పరుగులు లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ చేశాడు. 

New Update
IND vs PAK India Won The  Match

IND vs PAK India Won The Match

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా పాక్‌పై ఘన విజయం సాధించింది. రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 42.3 ఓవర్లలో 242 పరుగులు లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 111 బంతుల్లో సెంచరీ (100*) చేశాడు. ఇక శ్రేయస్‌ అయ్యర్(56) అర్దశతకం చేయగా.. రోహిత్‌(20), గిల్‌(46), హార్దిక్‌(8), అక్షర్‌(3*) పరుగులు చేశారు.

పాకిస్థాన్ ఔట్..

టీమిండియా 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించింది. వరుసగా రెండు మ్యాచ్‌లలో పాకిస్థాన్ ఓటమి పాలయ్యింది. దీంతో ఈ ఛాంపియన్స్ నుంచి పాక్ వైదొలిగింది. గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్‌లో ప్రతీ జట్టు రెండు విజయాలు సాధించాలి. ఇంతకు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పాకిస్థాన్ ఓటమి పాలైంది. ఈ రెండు మ్యాచ్‌లలో పాకిస్థాన్ ఓడిపోవడంతో ఇక ఈ ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి వైదొలిగింది.

ఇక పాకిస్థాన్‌ బ్యాటర్లలో సౌద్ షకీల్ 76 బంతుల్లో 62 పరుగులు చేశాడు. మహ్మద్ రిజ్వాన్ 46 (77) చేశాడు. ఇక ఓపెనర్లు  ఇమామ్ ఉల్ హక్ (10), బాబర్ అజామ్ (23) పరుగులకే ఔట్ అయ్యారు. సల్మాన్ అఘా (19), ఖుష్‌దిల్ షా (38) పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 3, హార్దిక్ పాండ్య 2, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా తలో వికెట్ తీశారు. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు