/rtv/media/media_files/2025/03/09/tgZ86y107hOIm2dEU7Ok.jpg)
INDIA WON
🔴 Champions Trophy 2025-India vs New Zealand LIVE:
దుబాయ్ వేదికగా IND - NZ జట్ల మధ్య జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 252 పరుగుల లక్ష్యాన్ని టీమ్ఇండియా 6 బంతులు మిగిలుండగానే ఛేదించింది. భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడం ఇది మూడోసారి.
India vs New Zealand: మొత్తానికి ఛాంపియన్స్ ట్రోఫీ ఇండియా సొంతం అయింది. బాగా భయపెట్టినా కప్ ను మాత్రం టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. రోహిత్ తరువాత వచ్చిన బ్యటార్లు అందరూ వరుసగా వికెట్లు పోగొట్టుకోవడంతో మ్యాచ్ ఓడిపోతారేమో అనుకున్నారు అందరూ. కానీ నెమ్మదిగా ఆడుతూ కివీస్ ఇచ్చిన 252 లక్ష్యాన్ని చేరుకుంది భారత జట్టు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా ఉండడంతో బ్యాటర్లకు కాస్త కష్టంగా మారింది.
మొదట బ్యాటింగ్ చేసినవాళ్ళకు కాస్త బాగానే ఉన్నా...లక్ష్య ఛేదనకు వచ్చిన ఇండియాకు మాత్రం చాలా బ్యాటింగ్ చేయడం చాలా కష్టమైంది. స్పిన్ బాగా తిరుగుతుండడంతో భారత బ్యాటర్లు ఆడటం ఇబ్బంది అయింది. పరుగులు రాబట్టకోవడం మాట అటుంచి...వికెట్ ను కాపాడుకోవడమే పెద్ద పని అయిపోయింది. కానీ మొత్తానికి భారత బ్యాటర్లు ఎలా అయితేనేం నెమ్మదిగా లక్ష్యాన్ని సాధించారు. మ్యాచ్ ను గెలిచి...కప్ ను సొంతం చేసుకున్నారు.
Also Read: Lalith Modi: లలిత్ మోదీకి వనువాటు పౌరసత్వం..ఎంతకు కొన్నారో తెలుసా?
సమిష్టి విజయం..
రోహిత్ హాఫ్ సెంచరీ, శ్రేయస్ అయ్యర్ 48 పరుగులు...చివర్లో కే ఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా మెరుపులతో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీని ఎగురేసుకుపోయింది. న్యూజిలాండ్ ఇచ్చిన 252 పరుగుల లక్ష్యాన్ని నాలుగు వికెట్లు, ఆరు బంతులు మిగిలుండగానే ఛేదించి ట్రోఫీని సొంతం చేసుకుంది టీమ్ఇండియా.
Also Read: Rains: రైతులకు షాక్.. ఈ ఏడాది వానలు అంతంత మాత్రమే.. వాతావరణ శాఖ ఏం చెప్పిందంటే!?
Also Read: Trolls on Jr NTR: ఎన్టీఆర్ యాడ్ పై గోరంగా ట్రోలింగ్..! వీడియో చూశారా?
-
Mar 10, 2025 07:43 IST
ఇదో అద్భుత విజయం..చెప్పడానికి మాటలు రావడం లేదు: కోహ్లీ!
-
Mar 10, 2025 07:43 IST
టీమిండియా విజయం.. ఆనందంలో సునీల్ గావాస్కర్ డ్యాన్స్
టీమ్ ఇండియా విజయం పట్ల లెజండరీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ఆనందంతో స్టేడియంలో స్టెప్పులు వేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. చిన్న పిల్లాడిలా క్యూట్‌గా సునీల్ డ్యాన్స్ వేశారని అంటున్నారు.
Suneel Gavaskar Dance video Photograph: (Suneel Gavaskar Dance video) -
Mar 10, 2025 07:27 IST
రిటైర్మెంట్‌పై రోహిత్ కీలక ప్రకటన
-
Mar 09, 2025 22:12 IST
Champions Trophy: కప్పు మనదే..ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేశారు
-
Mar 09, 2025 22:12 IST
Champions Trophy 2025: ఇది మన సత్తా.. టీమ్ ఇండియాపై ప్రముఖుల ప్రశంసలు!
-
Mar 09, 2025 22:11 IST
IND vs NZ: ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రోహిత్ శర్మ
-
Mar 09, 2025 22:04 IST
IND vs NZ: భారత్ విజయం అద్భుత ఫలితమని ప్రధాని మోదీ అన్నారు.
-
Mar 09, 2025 21:53 IST
IND vs NZ: న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం.
-
Mar 09, 2025 21:52 IST
Champions Trophy: కప్పు మనదే..ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేశారు
-
Mar 09, 2025 21:52 IST
Champions Trophy: కప్పు మనదే..ఛాంపియన్స్ ట్రోఫీ కొట్టేశారు
-
Mar 09, 2025 21:47 IST
IND vs NZ: 48 ఓవర్లకు స్కోరు 245/6.
-
Mar 09, 2025 21:43 IST
IND vs NZ: భారత్ విజయానికి 13 బంతుల్లో 7 పరుగులు అవసరం
-
Mar 09, 2025 21:42 IST
IND vs NZ: హార్దిక్ పాండ్య (18) ఔట్..
-
Mar 09, 2025 21:40 IST
IND vs NZ: భారత్ విజయానికి 15బంతుల్లో 11 పరుగులు అవసరం
-
Mar 09, 2025 21:40 IST
IND vs NZ: ఉత్కంఠగా మ్యాచ్
-
Mar 09, 2025 21:32 IST
IND vs NZ: ఇంకా 30 బంతుల్లో 32 రన్స్ అవసరం
-
Mar 09, 2025 21:31 IST
IND vs NZ: 45 ఓవర్ల ఆట పూర్తి. భారత్ స్కోరు 220/5.
క్రీజులో హార్దిక్ పాండ్య (6), KL రాహుల్ (23)
-
Mar 09, 2025 21:13 IST
IND vs NZ: భారత్ 5వ వికెట్ డౌన్... అక్షర్ పటేల్ (29) ఔట్..
-
Mar 09, 2025 21:07 IST
IND vs NZ: భారత్ స్కోరు 191/4 (40.0)
-
Mar 09, 2025 21:06 IST
IND vs NZ: 4వ వికెట్ కోల్పోయిన భారత్.. శ్రేయస్ అయ్యర్ (48) ఔట్
-
Mar 09, 2025 21:04 IST
IND vs NZ: శ్రేయస్ అయ్యర్ (48) ఔట్..
-
Mar 09, 2025 21:04 IST
IND vs NZ: శ్రేయస్ అయ్యర్ క్యాచ్ మిస్ చేసిన జేమీసన్..
-
Mar 09, 2025 20:55 IST
IND vs NZ: భారత్ స్కోరు 183/3 (37.5)
-
Mar 09, 2025 20:44 IST
IND vs NZ: భారత్ స్కోరు 161/3 (35.1)
-
Mar 09, 2025 20:28 IST
IND vs NZ: 30 ఓవర్లకు భారత్ స్కోరు 136-3
-
Mar 09, 2025 20:19 IST
IND vs NZ: 27 ఓవర్లకు భారత్ స్కోరు 122/3
క్రీజులో అక్షర్ పటేల్ (0), శ్రేయస్ అయ్యర్ (9) ...
-
Mar 09, 2025 20:14 IST
IND vs NZ: భారత్‌కు భారీ షాక్.. రోహిత్ ఔట్ (76)
రోహిత్ శర్మ (76)
83 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లు.
రచిన్ రవీంద్ర వేసిన 26.1 ఓవర్‌కు భారీ షాట్ ఆడే ప్రయత్నంలో రోహిత్ స్టంపౌటయ్యాడు.
-
Mar 09, 2025 20:08 IST
IND vs NZ: 23 ఓవర్లకు స్కోరు 117/2.
- శ్రేయస్ అయ్యర్ (7)
- రోహిత్ శర్మ (73)
-
Mar 09, 2025 19:55 IST
IND vs NZ: 20 ఓవర్లకు భారత్ స్కోరు 108/2
శ్రేయస్ అయ్యర్ (1), రోహిత్ (70)
-
Mar 09, 2025 19:52 IST
IND vs NZ: టీమ్ఇండియాకు బిగ్ షాక్.. కోహ్లీ ఔట్ 1(1)
బ్రాస్‌వెల్ వేసిన 19.1 ఓవర్‌కు ఎల్బీడబ్ల్యూగా విరాట్ కోహ్లీ (1) ఔటయ్యాడు.
Virat Kohli OUT -
Mar 09, 2025 19:48 IST
IND vs NZ: శుభ్‌మన్ గిల్ (31) ఔట్..
శాంట్నర్ వేసిన 18.4 ఓవర్‌కు గ్లెన్ ఫిలిప్స్ గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో సూపర్ క్యాచ్
-
Mar 09, 2025 19:41 IST
IND vs NZ: 18 ఓవర్లకు భారత్ స్కోరు 103/0
-
Mar 09, 2025 19:39 IST
IND vs NZ: దుల్లగొడుతున్న టీమ్ఇండియా ఓపెనర్స్... తగ్గేదేలే..!
-
Mar 09, 2025 19:31 IST
IND vs NZ: 15 ఓవర్లకు భారత్ స్కోరు 93/0
-
Mar 09, 2025 19:22 IST
IND vs NZ: వన్డేల్లో రోహిత్ 58వ అర్ధ శతకం..
-
Mar 09, 2025 19:22 IST
IND vs NZ: రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
41 బంతుల్లో అర్ధ శతకం పూర్తి
-
Mar 09, 2025 19:10 IST
IND vs NZ: రోహిత్ ఆన్ ఫైర్.. 8 ఓవర్లకు స్కోరు 59/0.
రోహిత్ (47), గిల్ (7)
-
Mar 09, 2025 18:59 IST
IND vs NZ: 5 ఓవర్లకు భారత్ స్కోరు 31/0
రోహిత్ శర్మ (21), శుభ్‌మన్ గిల్ (5)
-
Mar 09, 2025 18:54 IST
IND vs NZ: 3 ఓవర్లకు భారత్ స్కోరు 22/0
-
Mar 09, 2025 18:53 IST
IND vs NZ: 2 ఓవర్లకు స్కోరు 22/0.
రోహిత్ (18), గిల్ (0)
-
Mar 09, 2025 18:53 IST
IND vs NZ: రోహిత్ దూకుడు.. ఒకే ఓవర్‌లో రెండు ఫోర్లు
-
Mar 09, 2025 18:51 IST
IND vs NZ: ఫస్ట్ ఓవర్‌లో సిక్సర్ బాదిన రోహిత్ శర్మ
జేమీసన్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్‌లో 9 పరుగులు
-
Mar 09, 2025 18:50 IST
IND vs NZ: బరిలోకి దిగిన టీమ్ఇండియా.. టార్గెట్ 252
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్..
-
Mar 09, 2025 18:23 IST
Rohit Sharma: రోహిత్ శర్మ అరుదైన రికార్డు..!
రోహిత్ శర్మ మ్యాచ్ ఆరంభంలోనే అరుదైన రికార్డును సమం చేశాడు. దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్‌ను మరోసారి ఓడిపోయాడు. దీంతో విండిస్ దిగ్గజం బ్రయన్ లారా (1998-99) సీజన్‌లో వరుసగా 12 సార్లు టాస్ కోల్పోయిన రికార్డును అతడు ఈక్వల్ చేశాడు.
Rohit Sharma Skip India Champions Trophy Match Against New Zealand Photograph: (Rohit Sharma Skip India Champions Trophy Match Against New Zealand) -
Mar 09, 2025 18:05 IST
IND VS NZ: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్ బ్యాటింగ్ ముగిసింది.. భారత్ లక్ష్యం 252
-
Mar 09, 2025 18:05 IST
IND VS NZ: కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలు తలో రెండు వికెట్స్ పడగొట్టారు.
-
Mar 09, 2025 18:04 IST
IND VS NZ: 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 రన్స్....
డారిల్ మిచెల్ (63), మైకేల్ బ్రాస్‌వెల్ (51 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేశారు.
-
Mar 09, 2025 18:03 IST
IND VS NZ: భారత్ లక్ష్యం 252
-
Mar 09, 2025 18:03 IST
IND VS NZ: కివీస్ మొదటి బ్యాటింగ్ పూర్తి.. భారత్ టార్గెట్ ఎంతంటే?
-
Mar 09, 2025 17:57 IST
IND vs NZ: 7వ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్.. మిచెల్ శాంట్నర్ ఔట్