సీనియర్ ఆటగాళ్ళ వైఫల్యం టీమ్ ఇండియాను కష్టాల్లోకి నెట్టేసింది. మిగతా ప్లేయర్లు ఆడినా ఫలితం లేకుండా పోయింది. నాలుగో టెస్ట్‌లో గట్టెక్కి టెట్ సీరీస్ మీద ఆశలు సజీవంగా ఉంచుతారు అనుకున్నారు. ఆశలపై నీళ్లు చల్లుతూ డ్రా ముంగిట బోల్తాకొట్టింది. భారీ విజయాన్నందుకున్న ఆస్ట్రేలియా సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. జైస్వాల్ ఒంటరి పోరాటం వృధాగా మారిపోయింది. టీమ్‌ఇండియా ఆఖరి సెషన్లో అనూహ్యంగా కుప్పకూలింది. ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో పంత్ అనవసర షాట్‌తో ఔట్ కావడం మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. దాని తరువాత ఆస్ట్రేలియా భారత టీమ్‌ను ఈజీగా చేతుల్లోకి తీసేసుకుంది. తప్పనిసరిగా గెలవాలి.. నాలుగో టెస్ట్‌లో ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసి 474 పరుగులు చేసింది. ఆ తరువాత టీమ్ ఇండియా తన మొదట ఇన్నింగ్స్‌లో 369 పురుగులు చేసింది. ఇందులోనే తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి అద్భుతమైన సెంచురీ చేశాడు. ఆ తరువాత ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేసి...టీమ్ ఇండియాకు 340 పరుగుల లక్ష్యం ఇచ్చింది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో భారత్ పూర్తిగా విఫలమైంది. 155 పరుగులకే కుప్పకూలింది. యశస్వి జైస్వాల్ ఒక్కడే 84 రుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. తరువాత పంత్ 30 పరుగులు చేసి.. కీలక సమయంలో పేలవ షాట్‌తో నిష్క్రమించాడు. కమిన్స్ (3/28), బోలాండ్ (3/39), లైయన్ (2/37) భారత్ పతనాన్ని శాసించారు.దీంతో ఆస్ట్రేలియా చేతిలో 184 పరుగుల భారీ తేడాతో పరాజయం పాలైంది. కమిన్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యం సంపాదించింది. చివరిదైన అయిదో టెస్టు శుక్రవారం ఆరంభమవుతుంది. ఇందులో భారత్ ప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది. అలా అయితేనే టెస్ట్ సీరీస్ డ్రాగా ముగుస్తుంది. లేకపోతే సీరీస ఆస్ట్రేలియా వశం అవుతుంది. Also Read: Year Ender 2024: ఈ ఏడాది ఎన్నికల్లో గెలిచిన సెలబ్రిటీలు..