2024 Retirements: 2024.. జెంటిల్‌మెన్ గేమ్‌లో మరిచిపోలేని జ్ఞాపకాలను మిగిల్చింది. కొన్నేళ్లపాటు తమ అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ లవర్స్‌ను అలరించి, ఉర్రూతలూగించి, భావోద్వేగానికి గురిచేసిన దిగ్గజ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించారు. భారత్ తోపాటు ఇతర దేశాల ఆటగాళ్లు వీడ్కోలు పలికారు. ముఖ్యంగా ఈ 2024 టీమ్ ఇండియా T20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకోవడం నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్ 3వ IPL ట్రోఫీని అందుకోవడం వరకు ఎన్నో తీపి గుర్తులు మిగిల్చింది. అయినప్పటికీ అనేక మంది దిగ్గజ ఆటగాళ్ళు వారి విశిష్టమైన కెరీర్‌లకు వీడ్కోలు పలికినందున ఇది కొంతమంది భావోద్వేగ వీడ్కోలుగా చెప్పుకొవచ్చు. కోహ్లీ, రోహిత్, అశ్విన్, జడేజా, డీకే.. 2024 బార్బడోస్‌లో భారతదేశం T20 ప్రపంచ కప్ విజయం సాధించిన ఆనందంలోనే కోహ్లీ, రోహిత్, జడేజా అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ దిగ్గజ ఆటగాళ్లు టీ20లనుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 36 ఏళ్ల కోహ్లీ 125 మ్యాచ్‌ల్లో 48.69 సగటుతో 4,188 పరుగులతో టీ20 కెరీర్‌ను ముగించాడు. 2014 , 2016 T20 ప్రపంచకప్‌లలో రెండుసార్లు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అందుకున్నాడు. రోహిత్ 159 T20Iలు ఆడి 4,231 పరుగులు చేశాడు. టీ20 ఫార్మాట్‌లో అత్యధిక స్కోర్ చేసిన వారిలో ఒకడిగా నిలిచాడు. ఆల్ రౌండర్ జడేజా 74 T20Iలలో 515 పరుగులు చేసి 54 వికెట్లు పడగొట్టాడు. ఇక భారత దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. బ్రిస్బేన్‌లోని గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టు తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అభిమానులను ఆశ్చర్యపరిచాడు. శిఖర్ ధావన్: సొగసైన ఎడమచేతి వాటం ఆటగాడు శిఖర్ ధావన్ ఆగస్టు 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టుల్లో 2,315 పరుగులు 7 సెంచరీలు, వన్డేల్లో 6,793 పరుగులు 17 సెంచరీలు, T20Iలలో 1,579 పరుగులు చేశాడు. పరిమిత ఓవర్ల ఆటలో భారత్ సాధించిన విజయాలలో ధావన్ కీలక పాత్ర పోషించాడు. 2013, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో అతని వీరోచిత ఇన్నింగ్స్ క్రికెట్ అభిమానుల జ్ఞాపకాలలో పదిలంగా నిలిచిపోయాయి. కుర్రాళ్ల పోటీ కారణంగా అవకాశాలు లేక భారంగానే వీడ్కోలు పలికాడు ధవన్. Shikhar Dhawan దినేష్ కార్తీక్: IPL 2024 ముగిసిన కొద్ది రోజులకే దినేష్ కార్తీక్ తన రిటైర్మెంట్ ప్రకటించాడు. ఒక ఉద్వేగభరితమైన పోస్ట్ పెట్టిన డీకే.. ముందున్న కొత్త సవాళ్ల కోసం సిద్ధంగా ఉన్నానంటూ ఎమోషనల్ అయ్యాడు. కార్తీక్ IPL 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)కి ప్రాతినిధ్యం వహించాడు. ఫినిషర్‌గా మన్ననలు పొందిన డీకే.. 26 టెస్టులు, 94 ODIలు 60 T20Iలు ప్రతినిథ్యం వహించాడు. DK జేమ్స్ ఆండర్సన్ ఇంగ్లండ్..ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ ఆండర్సన్.. క్రికెట్ చరిత్రలో గొప్ప ఫాస్ట్ బౌలర్‌లలో ఒకరిగా గుర్తింపు పొందాడు. వెస్టిండీస్‌తో జరిగిన లార్డ్స్ టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా అండర్సన్ తన అద్భుతమైన కెరీర్‌ను ముగించాడు. అతను చివరిసారిగా మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు ఐకానిక్ లార్డ్స్ బెల్ మోగించారు. ఇది క్రికెట్ ఇంటిలో ఒక శకానికి ముగింపు పలికిందని దిగ్గజాలు వ్యాఖ్యానించారు. James Anderson డేవిడ్ వార్నర్ ఆస్ట్రేలియా..సొంతగడ్డపై సిడ్నీలో పాకిస్థాన్‌తో జరిగిన టెస్టు సిరీస్ అనంతరం అసాధారణ కెరీర్‌కు తెర దించుతూ రిటైర్మెంట్ ప్రకటించాడు డెవిడ్ వార్నర్. ఈ డైనమిక్ ఎడమచేతి వాటం బ్యాటర్ ఆస్ట్రేలియా తరపున 112 టెస్ట్‌లు, 161 ODIలు, 110 T20Iలకు ప్రాతినిధ్యం వహించాడు. అన్ని ఫార్మాట్లలో 18,995 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియన్ క్రికెట్‌కు మూలస్తంభంలా నిలిచిన వార్నర్.. 2015 ICC క్రికెట్ ప్రపంచకప్, 2021 T20 ప్రపంచకప్‌తో సహా జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు. తన దూకుడైన ఆటతో ఆధునిక ఆటగాళ్లకు వార్నర్ ఆదర్శంగా నిలిచాడు. David warner నీల్ వాగ్నర్ న్యూజిలాండ్..ఆవేశపూరిత లెఫ్టార్మ్ పేసర్ నీల్ వాగ్నెర్ ఫిబ్రవరి 2024లో ఆస్ట్రేలియాతో సిరీస్‌కు ముందు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. న్యూజిలాండ్‌లో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదవ బౌలర్‌గా నిలిచాడు. అంతేకాదు న్యూజిలాండ్ ఆటగాళ్లలో 100కి పైగా టెస్టు వికెట్లు తీసిన దిగ్గజ ఆటగాడు సర్ రిచర్డ్ హ్యాడ్లీ (50) తర్వాత రెండో స్థానంలో ఉన్నాడు. వాగ్నర్ 64 టెస్టుల్లో 22 సగటుతో 143 వికెట్లు పడగొట్టాడు. అతను 2021లో న్యూజిలాండ్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఇమాద్ వసీం, మహ్మద్ అమీర్ పాకిస్థాన్.. పాకిస్థాన్‌కు చెందిన ఇమాద్ వాసిమ్, మహ్మద్ అమీర్ 2024 డిసెంబర్‌లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. మే 2015లో జింబాబ్వేపై అరంగేట్రం చేసిన ఇమాద్.. పాకిస్థాన్ తరఫున 55 వన్డేలు, 75 టీ20లు ఆడాడు. ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన ఇమాద్ అంతర్జాతీయ మ్యాచ్‌లలో 1,540 పరుగులు చేసి 117 వికెట్లు తీశాడు. ఇక 32 ఏళ్ల అమీర్.. జూన్ 2009లో అంతర్జాతీయ అరంగేట్రం చేసాడు. 36 టెస్టులు, 61 ODIలు, 62 T20Iలలో పాకిస్తాన్ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అతని అద్భుతమైన స్వింగ్ బౌలింగ్ తో 271 అంతర్జాతీయ వికెట్లు సాధించాడు. అన్ని ఫార్మాట్లలో 1,179 పరుగులు చేశాడు. Also Read: అయ్యో.. నితీష్‌కు నిరాశ, సెంచరీ చేసినా దక్కని ఫలితం! టిమ్ సౌథీ న్యూజిలాండ్..2024లో ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ పేసర్ టిమ్ సౌథీ టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన కెరీర్‌లో సౌతీ 107 టెస్టులు ఆడి 30.26 సగటుతో 391 వికెట్లు పడగొట్టాడు. 2008లో అరంగేట్రం చేసినప్పటి నుండి అతను నాలుగు ICC క్రికెట్ ప్రపంచకప్‌లు, ఏడు T20 ప్రపంచకప్‌లు, రెండు ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌లతోపాటు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్‌లలో పాల్గొన్నాడు. డేవిడ్ మలన్ ఇంగ్లండ్..టీ20ల్లో చాలాకాలం నంబర్1 బ్యాటర్ గా కొనసాగిన డేవిడ్ మలన్ రిటైర్మెంట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. మూడు అంతర్జాతీయ ఫార్మాట్‌లలో సెంచరీలు చేసిన అతికొద్ది మంది ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఇతను ఒకడిగా నిలిచాడు. 2017లో అరంగేట్రం చేసిన మలన్.. తన సొగసైన స్ట్రోక్‌ప్లేతో క్రికెట్ లవర్స్ ను ఫిదా చేశాడు. షానన్ గాబ్రియేల్..వెస్టిండీస్ పేసర్ గాబ్రియెల్ ఆగస్టు 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 36 ఏళ్ల అతను వెస్టిండీస్ తరపున 59 టెస్టులు, 25 ODIలు, రెండు T20లు ఆడాడు. మొత్తం కెరీర్ లో 202 వికెట్లు పడగొట్టాడు. అతను జూన్ 2018లో శ్రీలంకపై 13/121 టెస్టుల్లో ఈ బౌలింగ్ గణాంకాలను నమోదు చేసి ఔరా అనిపించాడు. Also Read: Rishab డార్క్ డేకి రెండేళ్లు.. యాక్సిడెంట్ తర్వాత జీవితం ఎలా మారింది? మొయిన్ అలీ ఇంగ్లండ్..ఇంగ్లండ్ ఆల్ రౌండర్ మొయిన్ అలీ సెప్టెంబర్ 2024లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 2014లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన మొయిన్ 6678 అంతర్జాతీయ పరుగులు చేశాడు. అంతేకాకుండా 366 వికెట్లు పడగొట్టాడు. ఇంగ్లాండ్ సాధించిన 2019 క్రికెట్ ప్రపంచకప్, 2022 T20 ప్రపంచకప్ జట్టులో ఉన్నాడు. షకీబ్ అల్ హసన్ (టీ20)బంగ్లాదేశ్ గొప్ప క్రికెటర్లలో ఒకరిగా పరిగణించబడుతున్న షకీబ్ 2024లో T20Iల నుండి రిటైర్ అయ్యాడు. కానీ 2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీ వరకు ODIలలో కొనసాగుతాడని తెలిపాడు. ఆల్ రౌండర్ అయిన షకీబ్.. 4000 టెస్ట్ పరుగులతో 240 వికెట్లు తీశాడు. T20I లలో 2251 పరుగులు చేసి 149 వికెట్లు తీశాడు. షకీబ్ తన వీడ్కోలు టెస్టు మ్యాచ్ దక్షిణాఫ్రికాతో మిర్పూర్‌లో ఉంటుందని ప్రకటించాడు. కానీ స్వదేశంలో నిరసనల కారణంగా అతను మ్యాచ్‌కు రాలేదు. దీంతో టెస్టు వీడ్కోలు వాయిదా పడింది. మహ్మదుల్లా (టీ20)బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఆల్-రౌండర్ మహ్మదుల్లా T20Iల నుండి రిటైర్ అయ్యాడు. అతను 130కి పైగా మ్యాచ్‌లు ఆడాడు. అన్ని ఫార్మాట్‌లో బంగ్లాదేశ్‌లో రెండవ లీడింగ్ స్కోరర్‌గా ఉన్నాడు. టీ20ల్లో 40 వికెట్లు కూడా తీశాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్ తరఫున వన్డేలు ఆడాలని తన కోరికను వ్యక్తం చేశాడు. సిద్ధార్థ్ కౌల్ భారత్..సిద్ధార్థ్ కౌల్ 17 ఏళ్ల కెరీర్‌ను ముగించుకుని నవంబర్ 2024లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్ల పేసర్ మూడు వన్డేలు, మూడు టీ20ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2008లో భారత U19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో కీలక సభ్యుడు. విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి భావి స్టార్లతో వేదికను పంచుకున్నాడు కౌల్.