BJP Candidate List 2025: ఢిల్లీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ.. కేజ్రీవాల్‌పై పోటీ ఎవరో తెలుసా?

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మాజీ ఎంపీ పర్వేశ్‌ వర్మను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్‌కు పోటీగా బీజేపీ బరిలోకి దింపనుంది. మొత్తం 29 మందితో ఉన్న ఈ జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది.

New Update
BJP List

BJP List Photograph: (BJP List)

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను  విడుదల చేసింది. మాజీ సీఎం సాహిబ్‌ సింగ్ వర్మ కుమారుడైన మాజీ ఎంపీ పర్వేశ్‌ వర్మను న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి కేజ్రీవాల్‌కు పోటీగా బీజేపీ బరిలోకి దింపనున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో 29 మందితో ఉన్న  జాబితాను విడుదల చేసింది. ఇందులో కరోల్‌ బాగ్‌ నుంచి దుష్యంత్‌ గౌతమ్‌, రాజౌరి గార్డెన్ నుంచి మాజిందర్‌ సింగ్‌ సిర్సా, బిజ్వాసన్‌ నుంచి కైలాశ్‌ గహ్లోత్‌, గాంధీనగర్ నుంచి అర్వీందర్‌ సింగ్‌ లవ్లీ పోటీ చేస్తున్నట్లు బీజేపీ తెలిపింది. 

ఇది కూడా చూడండి:EPFO Pension: పెన్షనర్లకు గుడ్ న్యూస్.. దేశంలో ఎక్కడి నుంచైనా..

ఇది కూడా చూడండి: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

ఇద్దరు మహిళలకు తొలి జాబితాలో చోటు

ఎన్నికల ప్రకటనకు ఇంకా వారం రోజులు ఉండగానే.. నలుగురు సిట్టింగ్ శాసన సభ్యులు, ఇద్దరు, మాజీ ఎంపీలు, ఎనిమిది మంది మాజీ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చింది. సీఎం అతిషిపై రమేష్ బిదూరి పోటీ చేయనున్నారు. బీజేపీ విడుదల చేసిన ఈ తొలి జాబితాలో ఇద్దరు మహిళలకు చోటు దక్కింది. సుశ్రి కుమారి రింకూలతో పాటు ఢిల్లీ యూనివర్సిటీ నాయకురాలు రేఖా గుప్తాకి బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇటీవల మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. అధికారంలో ఉన్న ఆప్ మళ్లీ అధిస్టానాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. 

ఇది కూడా చూడండి:  Cricket: 96 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

ఇది కూడా చూడండిDehydration: చలికాలంలో తక్కువ నీరు తాగుతున్నారా..? డీహైడ్రేషన్ లక్షణాలు ఇవే

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు