West Bengal SIR: పశ్చిమ బెంగాల్‌ తొలిదశ సర్ పూర్తి.. 58 లక్షల ఓట్లు తొలగింపు..

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ సర్ పెద్ద దుమారమే రేపుతుందనే అనుమానాలు కలుగుతున్నాయి.  తొలిదశలో భాగంగా బెంగాల్ రాష్ట్రం మొత్తమ్మీద 58 లక్షలకుపైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఈసీ తొలగించింది. ఇది పెద్ద వివాదమే రేపుతుందని అంటున్నారు. 

New Update
SIR

దేశవ్యాప్తంగా సమగ్రమైన, పారదర్శకమైన ఓటరు జాబితాలను రూపొందించాలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం (ECI)(central-election-commission) రెండో విడత స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో 9 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ చేపట్టాలని  నిర్ణయించింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనేది ఓటరు జాబితాలో సమగ్రతను, కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి ఎన్నికల సంఘం చేపట్టే ప్రత్యేకమైన, గడువుతో కూడిన ఇంటింటి తనిఖీ కార్యక్రమం. సాధారణంగా నిర్వహించే వార్షిక సవరణ కంటే ఇది చాలా విస్తృతమైనదే కాకుండా, లోతైనది కూడా. ఓటరు జాబితాలో అనర్హులు లేకుండా తొలగించడం అనేది ఇందులో ప్రధానమైనది. 

Also Read :  అభిమానుల కోసం కాదు...అధికారుల కోసం...మెస్సీ టూర్ వీడియోలు వైరల్

బెంగాల్ లో తొలిదశ పూర్తి..

ప్రస్తుతం పశ్చిమ బెంగాల్(west bengal) లో ఈ సర్ కార్యక్రమం జరుగుతోంది. అయితే దీనిపై చాలా రోజుల నుంచీ రాజకీయ వివాదం రేగుతోంది. తాజాగా పశ్చిమబెంగాల్‌లో తొలగించిన ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్‌ శుక్రవారం నియోజకవర్గాల వారీగా విడుదల చేసింది. ఎన్యూమరేషన్‌ పత్రాల సమర్పణకు గురువారం చివరిరోజు కాగా, మరుసటి రోజునే తొలగించిన ఓటర్ల వివరాలు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఈ జాబితానే  దుమారం రేపవచ్చని అంటున్నారు. ఎందుకంటే తొలిదశలో భాగంగా రాష్ట్రం మొత్తమ్మీద 58 లక్షలకు పైగా ఓటర్ల పేర్లను జాబితాల నుంచి ఈసీ తొలగించింది. సీఎం మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌కతాలోని భబానీపూర్‌ నియోజవర్గంలో 44,787 ఓట్లను తొలగించింది. ఈ నియోజవర్గంలో జనవరి నాటికి 1,61,509 మంది ఓటర్లు నమోదు కాగా, ప్రస్తుతం వారిలో చెప్పుకోదగ్గ సంఖ్యలోనే పేర్లను తీసేసింది. మరణాలు, ఓటర్లు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం, డూప్లికేట్‌ ఓట్లు ఉండడం వంటి కారణాలను ఎన్నికల కమిషన్‌ చూపించింది.

దీంతో పాటూ ప్రతిపక్ష నేత బీజేపీ సువేందు అధికారి ప్రతిసిధ్యం వహిస్తున్న నందిగ్రామ నియోజకవర్గంలో కూడా 10, 599 మంది పోర్లను ఓట్లర్ల లిస్ట్ నుంచి తొలగించారు. ఇక్కడ మొత్తం 2,78,212 మంది ఓటర్లు నమోదు అయ్యారు. అలాగే చౌరింగీ సెగ్మెంట్‌లో అత్యధికంగా 74,553 ఓట్లు, కోల్‌కతా పోర్టు నియోజకవర్గంలో 63,730 మంది, టాలీగంజ్‌లో 35,309 మంది పేర్లను అధికార్లు తొలగించారు. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న అసన్‌ సోల్‌ సౌత్‌లో 39,202, సిలిగురిల్లో 31,181 మంది పేర్లు తొలగించారు. జిల్లాల వారీగా విశ్లేషిస్తే దక్షిణ 24 పరగణాల జిల్లాలో అత్యధికంగా 8,16,047మంది ఓటర్లను అధికారులు తొలగించారు. అత్యల్పంగా బంకురా జిల్లాలోని కొతుల్‌పూర్‌ నియోజకవర్గంలో కేవలం 5,678 ఓట్లను మాత్రమే తీసివేశారు. ఈ మొత్తం లిస్ట్‌కు సంబంధించి ఈ నెల 16న ముసాయిదా ఓటర్ల జాబితాను ఈసీ విడుదల చేయనుంది. దీనిలో మొత్తం వివరాలు ఎంతమందిని తొలగించారు, ఎంత మందిని చేర్చారన్న సమాచారం ఉంటుందని ఈసీ చెబుతోంది. 

Also Read :  గుజరాత్ లో పాకిస్తాన్ బోటు...దేశంలోకి ఉగ్రవాదుల చొరబాటు?

Advertisment
తాజా కథనాలు