Viruska: విరాట్ కోహ్లీ-అనుష్క దంపతులు మరోసారి ప్రముఖ సాధువు ప్రేమానంద్ మహారాజ్‌ను సంప్రదించారు. గతంలోనూ ఫామ్‌లేమితో బాధపడిన కోహ్లీ ప్రేమానంద్‌ను కలవగా.. మళ్లీ ఇన్నాళ్లకు పిల్లలతోకలిసి మహారాజ్‌ను కలవడానికి బృందావన్ వెళ్లడం చర్చనీయాంశమైంది. అంతేకాదు వీరిద్దరు సాధువుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదాలు తీసుకోగా ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియో వైరల్ అవుతోంది. Also Read: Sabarimala వెళ్లేవారికి గుడ్‌న్యూస్.. రూ.1033 కోట్లతో మాస్టర్ ప్లాన్ గతంలోనూ కలిసిన కోహ్లీ.. దేశంలోని ప్రముఖులు తరచూ బృందావనంలోని ప్రేమానంద్ గోవింద్ శరణ్ మహారాజ్‌ని దర్శనం చేసుకునేందుకు వస్తుంటారు. అయితే గత కొన్నేళ్లుగా విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ జంట అనేక మతపరమైన యాత్రలు చేపట్టారు. ఇందులో భాగంగానే వారిద్దరూ ప్రఖ్యాత సాధువు ప్రేమానంద్ మహారాజ్‌ని కలవడం కోసం బాబా నీమ్ కరౌలీ కైంచి ధామ్‌కు వెళ్లారు. విరాట్, అనుష్క రెండవసారి ప్రేమానంద్ మహరాజ్ వద్దకు రావడం చర్చనీయాంశమైంది. గతంలోనూ ఫామ్ లేమితో బాధపడుతున్నప్పుడు వచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకున్న విరాట్.. మరోసారి ఆడటలేక ఇబ్బందిపడుతుండటం తెలిసిందే. కాగా మరోసారి ఆయన దగ్గరకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక విరాట్ అతనికి వంగి నమస్కరించగా అనుష్క శర్మ మహారాజ్‌కు పాదాభివందనం చేశారు. ఇది కూడా చదవండి: Fun Bucket Bhargav: బిగ్ షాక్..! ఫన్‌బకెట్ భార్గవకు 20 ఏళ్ల జైలు అయితే ఈ సందర్భంగా విరాట్ అనుష్కను ఆమె యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అతనితో అనుష్క మాట్లాడుతూ.. 'చివరిసారి మేము వచ్చినప్పుడు నా మనస్సులో కొన్ని ప్రశ్నలు అలాగే మిగిలిపోయాయి. ఇప్పుడు అవి అడగాలని అనుకున్నాను. కానీ అక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఇదే ప్రశ్న అడిగారు. కాబట్టి మీరు నాకు ప్రేమ, భక్తిని మాత్రమే ప్రసాదించండి' అని కోరింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కోహ్లీ ఫ్లాప్..ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ తన బ్యాట్‌తో మ్యాజిక్ చేయలేకపోయాడు. ఐదు మ్యాచ్‌లు ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 190 పరుగులు మాత్రమే చేశాడు. విరాట్ బ్యాట్‌లో ఒకే ఒక్క సెంచరీ వచ్చింది (పెర్త్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో 100 నాటౌట్). View this post on Instagram A post shared by Bhajan Marg Official (@bhajanmarg_official) View this post on Instagram A post shared by Bhajan Marg Official (@bhajanmarg_official)