విపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కులగణనపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను ఉత్తరప్రదేశ్‌లో బరేలీ జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది. జనవరి 7న కోర్టులో హాజరుకావాలని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై పంకజ్ పాఠక్ అనే వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశారు. Also Read: కాంగో నదిలో పడవ బోల్తా..వందమందికి పైగా.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలు దేశంలో విభజన, అశాంతిని ప్రేరేపించే అవకాశం ఉందని.. న్యాయపరంగా జోక్యం తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆరోపిస్తూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ముందుగా ప్రత్యేక ఎంపీ, ఎమ్మెల్యే కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దీనిపై విచారణ తిరస్కరణకు గురైంది. ఆ తర్వాత ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఈ వ్యవహారంపై తాజాగా విచారణ చేపట్టిన న్యాయస్థానం రాహుల్‌గాంధీకి నోటీసులు పంపించింది. #WATCH | Uttar Pradesh: Bareilly District Court issues notice to Lok Sabha LoP and Congress MP Rahul Gandhi over his statement on caste census. Petitioner, Pankaj Pathak says "We felt that the statement given by Rahul Gandhi during the elections on caste census was like an… pic.twitter.com/Es8rxilbTU — ANI (@ANI) December 22, 2024 Also Read: ఇప్పుడు చెప్పండి ఎవరిది తప్పో..సంచలన వీడియో బయటపెట్టిన బన్నీ ఫ్యాన్స్! ఇదిలాఉండగా.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌లో రాహుల్‌గాంధీ మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీలకు చెందినవారు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు మొదటగా కులగణన నిర్వహిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామని తెలిపారు. అయితే ఈ వ్యాఖ్యలపైనే పిటిషనర్ కోర్టుకు వెళ్లినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. Also Read: సీఎం రేవంత్ ను కలిసిన బీజేపీ ఎంపీ అర్వింద్.. అసలేం జరుగుతోంది? Also Read: స్కూల్స్‌కు ఫేక్ బాంబ్ కాల్స్ స్టూడెంట్సే.. ఎగ్జామ్ రద్దు కోసం ఎంతకు తెగబడ్డారంటే..!