/rtv/media/media_files/2025/12/13/ugc-2025-12-13-16-08-45.jpg)
దేశంలో ప్రైవేటు విద్యాసంస్థల నియంత్రణ, నిరంతర పర్యవేక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం మూడు విద్యా నియంత్రణా సంస్థలను రద్ధు చేసింది. ఇందులో భాగంగా ప్రస్తుతం విడివిడిగా ఉన్న UGC, AICTE, NCTEలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు చర్యలు మొదలుపెట్టింది. దీని కోసమే రూపొందించిన వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్ బిల్లుకు నిన్న కేంద్ర మంత్రి మండలి ఆమోదం కూడా తెలిపింది. జాతీయ విద్యా విధానంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేశారు.
Also Read : తప్పయింది క్షమించండి: మమతా బెనర్జీ
ఒకే గొడుగు కిందకు..
దేశంలో ఉన్నత విద్యా సంస్థల నియంత్రణ కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్.సి.టీ.ఈ) పనిచేస్తున్నాయి. 1956లో యూజీసీ, 1945లో ఏఐసీటీఈ, 1995లో ఎన్సీటీఈ ను ఏర్పాటు చేశారు. అయితే ఈ మూడు సంస్థలు లక్ష్యాలను సాధించడంలో ఈ మూడు సంస్థలు పూర్తిగా వైఫల్యం చెందడంతో పాటు సమన్వయం లేకుండా పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందుకే వీటిని ఒకే నియంత్రణ కిందకు మార్చింది. దానికి వికసిత భారత్ శిక్షా అధీక్షణ్ అని పేరు పెట్టారు. అయితే ఇందులో వైద్య విద్య, న్యాయ విద్య కోసం పని చేస్తున్న సంస్థలను మాత్రం మినహాయించారు. - new-bill
Also Read : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అదిరిపోయే న్యూ ఫీచర్లు
మూడు బాధ్యతలతో వికసిత భారత్ శిక్షా అధీక్షణ్
ఈ కొత్త వ్యవస్థకు ప్రధానంగా మూడు బాధ్యతలను అప్పగించనున్నారు. అవే రెగ్యులేషన్, అక్రెడిటేషన్, ప్రమాణాలు నిర్దేశించడం. కానీ ఈ వ్యవస్థకు విద్యా సంస్థలకు నిధులు కేటాయించే అధికారం మాత్రం ఉండదని తెలుస్తోంది. మొత్తం బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. ఈ కొత్త వికసిత భారత్ శిక్షా అధీక్షణ్ ఇక మీదట నుంచీ నియంత్రణతో పాటూ గుర్తింపు ఇచ్చే అధికారాలను కలిగి ఉండడంతో పాటు వృత్తి పరమైన నైపుణ్యాన్ని పెంపొందించనున్నాయి. 2018 లోనే యూజీసీ యాక్టును రద్ధు చేసి సెంట్రల్ కమిషన్ ఏర్పాటు చేయాలని అనుకున్నారు. కానీ అప్పట్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవ్వడంతో ఆ ప్రతిపాదనను రద్దు చేసుకున్నారు. 2021 లో కేంద్ర విద్యా శాఖ మంత్రిగా దర్మేంధ్ర ప్రధాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత దీన్ని మళ్ళీ తెర మీదకు తీసుకువచ్చారు. ఇప్పుడు మళ్ళీ దాన్నే కాస్త మార్చి వికసిత్ భారత్ శిక్షా అధిక్షన్ బిల్లు గా మార్పు చేసి కేంద్ర మంత్రి మండలి ముందు పెట్టారు. నకిలీని తగ్గించడానికి, జవాబుదారీతనాన్ని కొనసాగిస్తూ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి విధుల నియంత్రణ, అక్రిడిటేషన్, విద్యా ప్రమాణాలు, నిధులుగా విభజించాలని ఇందులో సిఫార్సు చేశారు. ఈ బిల్లు ఇప్పుడు పార్లమెంట్ లో ఆమోదం పొందితే చట్టంగా మారి..అమలులోకి వస్తుంది. - parliament
Follow Us