IARI: ఐఏఆర్ఐ డైరెక్టర్‌‌గా తెలుగు వ్యక్తి

భారత వ్యవసాయ పరిశోధన సంస్థ డైరెక్టర్‌‌గా చెరుకుమల్లి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఐఏఆర్ఐ కు ఒక తెలుగు వ్యక్తి డైరెక్టర్ కావడం ఇదే మొదటిసారి. ఈయన ప్రస్తుతం ఎన్‌ఏఏఆర్ఎమ్ లో డైరెక్టర్‌‌గా ఉన్నారు.

New Update
director

Ch.Srinivasa Rao

భారత వ్యవసాయ పరిశోధన సంస్థకు డైరెక్టర్‌‌గా మొట్టమొదటిసారి ఒక తెలుగు వ్యక్తిని నియమించారు. ప్రస్తుతం నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ మేనేజ్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న శ్రీనివాసరావును ఐఏఆర్ఐకు డైరెక్టర్‌‌గా నియమించారు. ఈ సంస్థకు డైరెక్టర్‌‌గా ఒక తెలుగు వ్యక్తిని నియమించడం ఇదే మొదటిసారి. 

శ్రీనివాసరావు 1965 అక్టోబరు 4న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా అనిగండ్లపాడులో జన్మించారు. 1975-80 వరకు అనిగండ్లపాడు జిల్లా పరిషత్‌ పాఠశాలలో చదువుకున్న తర్వాత.. బాపట్ల వ్యవసాయ కళాశాలలో అగ్రికల్చరల్ బీఎస్‌సీ పట్టా అందుకున్నారు. ఆతరువాత శ్రీనివాసరావు ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో ఎంఎస్‌సీ, పీహెచ్‌డీ పూర్తి చేశారు. దీని తరువాత ఇజ్రాయెల్ టెల్-అవివ్ విశ్వవిద్యాలయంలో పోస్ట్-డాక్టోరల్ చేశారు. చదువు అయ్యాక శ్రీనివాసరావు భారత్‌లోని పలు పరిశోధన సంస్థల్లో వివిధ హాదాల్లో పనిచేశారు.

Also Read: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు అస్వస్థత ..

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు