Sukhoi Su-30 MKI: అస్సాంలో గల్లంతైన సుఖోయ్ యుద్ధ విమానం.. రంగంలోకి ఎయిర్ ఫోర్స్

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక సుఖోయ్ Su-30MKI యుద్ధ విమానం అస్సాం గగనతలంలో అదృశ్యమైంది. గురువారం రాత్రి రొటీన్ ట్రైనింగ్ మిషన్‌లో ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఈ విమానం, అస్సాంలోని కార్బీ ఆంగ్లాంగ్ జిల్లా రాడార్‌తో సంబంధాలను కోల్పోయింది.

New Update
_Sukhoi Su-30 MKI

ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన అత్యాధునిక సుఖోయ్ Su-30MKI యుద్ధ విమానం(Sukhoi fighter jet tires) అస్సాం(assam) గగనతలంలో అదృశ్యమైంది. గురువారం రాత్రి రొటీన్ ట్రైనింగ్ మిషన్‌లో ఆకాశంలో చక్కర్లు కొట్టిన ఈ విమానం, అస్సాంలోని కార్బీ ఆంగ్లాంగ్ జిల్లా పరిసరాల్లో రాడార్‌తో సంబంధాలను కోల్పోయింది. విమానం(Air Force jet crashes) గల్లంతైనట్లు సమాచారం అందడంతో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలు ప్రారంభించింది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం, ఈ యుద్ధ విమానం అస్సాంలోని జోర్హాట్ ఎయిర్‌బేస్ నుండి రాత్రి సుమారు 7:00 గంటలకు బయలుదేరింది. ప్రయాణం ప్రారంభించిన కొద్దిసేపటికే, అంటే రాత్రి 7:42 గంటల సమయంలో గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానం రాడార్ నుండి మాయమవ్వడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు.

Also Read :  తెలంగాణ కొత్త గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా.. 9 రాష్ట్రాల గవర్నర్లు మార్పు

సెర్చ్ ఆపరేషన్

విమానం చివరిగా కనిపించిన ప్రాంతాన్ని గుర్తించిన ఐఏఎఫ్, వెంటనే సెర్చ్ అండ్ రెస్క్యూ (SAR) ఆపరేషన్ ప్రారంభించింది. హెలికాప్టర్లు, ఇతర నిఘా విమానాల సహాయంతో దట్టమైన అడవులు, కొండ ప్రాంతాల్లో గాలిస్తున్నారు. స్థానిక ప్రజలు కార్బీ ఆంగ్లాంగ్ జిల్లాలోని చోకీహోలా ప్రాంతంలో పెద్ద శబ్దం విన్నట్లు సమాచారం ఇవ్వడంతో, ఆ దిశగా కూడా అన్వేషణ సాగుతోంది. "విమానం(Sukhoi Su-30 MKI)లో ఇద్దరు పైలట్లు ఉన్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి గురించి ఎటువంటి స్పష్టత లేదు. సహాయక బృందాలు అన్ని కోణాల్లో గాలింపు చేపడుతున్నాయి." అని రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు.

సవాళ్లు 
విమానం అదృశ్యమైన ప్రాంతం భౌగోళికంగా చాలా క్లిష్టమైనది. దట్టమైన అడవులు, ప్రతికూల వాతావరణం కారణంగా సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఇప్పటికే జోర్హాట్ నుంచి మెడికల్ టీంలు, అంబులెన్సులు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. గతంలో కూడా అస్సాం సరిహద్దుల్లో కొన్ని సుఖోయ్ విమానాలు సాంకేతిక లోపాలతో కూలిపోయిన ఘటనలు ఉండటంతో, తాజా ఘటన వైమానిక రంగంలో ఆందోళన కలిగిస్తోంది. సుఖోయ్ Su-30MKI మన ఎయిర్ ఫోర్స్‌లో అత్యంత శక్తివంతమైన, కీలకమైన యుద్ధ విమానం. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఐఏఎఫ్ ఆదేశించే అవకాశం ఉంది.

Also Read :  ఇండియాలో కుప్పకూలిన కోడి గుడ్డు ధర.. రోజుకు రూ. 5 కోట్ల నష్టం!

Advertisment
తాజా కథనాలు