GOA: గోవాలో రికార్డ్ స్థాయిలో పర్యాటకులు.. చైనాదంతా అబద్ధపు ప్రచారం

రీసెంట్‌గా గోవాకు పర్యాటకులు తగ్గిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. కానీ చివరకు అవన్నీ అబద్ధాలని తేలాయి. గోవాలో టూరిజం విపరీతంగా అభివృద్ధి చెందుతోందని..ఇంతకు ముందు కంటే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. 

author-image
By Manogna alamuru
New Update
india

GOA

గోవా...ఇది అందరికీ డ్రీమ్ డెస్టినేషన్. జీవితంలో ఒక్కసారైనా గోవా వెళ్ళాలని చాలా మంది తపిస్తుంటారు. కొంతమంది అయితే అదే పనిగా అక్కడకు వెళుతుంటారు. ఇండియాలో ఉన్నవారికే కాదు విదేశీయులకు సైతం గోవా ఫేవరెట్ టూరిజం స్పాట్. దేశదేశాల నుంచి ఇక్కడకు వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ఫుడ్, కల్చరల్, ప్రకృతి అందాలు...ఇలా అన్నింటిలోనూ గోవా ఫస్ట్ ఉంటుంది. పార్టీయింగ్ చేసుకోవాలంటే అక్కడకు వెళ్ళాల్సిందే. చాలామందికి వెడ్డింగ్ డెస్టినేషన్ కూడా ఇదే. అలాంటి గోవా ఈ మధ్య కాలంలో చాలా డల్ అయిపోయిందని పుకార్లు వచ్చాయి. సోషల్ మీడియా అంతా ఒకటే గగ్గోలు పెట్టింది. 

Also Read: Tibet: టిబెట్ లో మృత్యుఘోష..ఇప్పటివరకు 126మంది మృతి

రికార్డ్ స్థాయిలో పర్యాటకులు..

కానీ వాస్తవ పరిస్థితి అందుకు చాలా భిన్నంగా ఉంది. గోవా (Goa) లో టూరిజం మాంచి ఊపుమీదుందని చెబుతున్నారు. ఇంతకు ముందు కంటే ఇప్పుడు పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని తెలుస్తోంది. హోటల్స్ అన్నీ దాదాపు బుక్ అయిపోయాయి. బీచ్‌లు జనాలతో నిండిపోయాయని చెబుతున్నారు. గోవాలో ఇంతకు ముందు అంతగా ప్రాచుర్యం పొందని కేరీ, కెననోనా లాంటి ప్రదేశాల్లో కూడా సందర్శకులు ఎక్కువైపోయారని అంటున్నారు. ఇక అంజునా, బాగా బీచ్‌ల గురించి అయితే చెప్పనే అక్కర్లేదు. 

Also Read: USA: బందీలను విడిచిపెట్టకపోతే మీ పని అంతే..హమాస్‌కు ట్రంప్ వార్నింగ్

దీంతో గోవా గురించి వచ్చిన వార్తలన్నీ పుకార్లని తేలిపోయాయి. చైనా ఎకానమిక్ ఇన్ఫర్మేషన్ సెటర్ చేసిన సర్వే నిరాధారమైనది కొట్టిపడేస్తున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కావాలని తమ వ్యూస్‌ను పెంచుకోవడానికి చేసిన జిమ్మిక్కని చెబుతున్నారు. ఒక్క డిసెంబర్‌‌లోనే గోవాకు 75.51 కోట్ల ఆదాయం వచ్చింది. ఏప్రిల్–డిసెంబర్ మధ్య కాలంలో అయితే ఏకంగా 4614.77 కోట్లు రాబడి వచ్చిందని చెబుతున్నారు. ఇదంతా కేవలం పర్యాటకం ద్వారా వచ్చిన సంపాదనే అని లెక్కలు చెబుతున్నారు. 

Also Read: Cricket: ఛాంపియన్స్ ట్రోఫీకి కెప్టెన్‌గా రోహిత్ వైపే బీసీసీఐ మొగ్గు

Also Read: Sheikh Hasina: బంగ్లా మాజీ ప్రధాని షేక్‌ హాసినా పాస్‌పోర్టు రద్దు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు