శివసేన (UBT) అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన(MNS) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే మళ్లీ కలిశారు. బంధువుల వివాహ వేడుకలో ఇరు కుటుంబాలు హాజరుకాగా ఒకరినొకరు పలకరించుకున్నారు. గతంలో రాజకీయంగా భేదాభిప్రాయాలతో విడిపోయిన సోదరులు మళ్లీ కలవడం చర్చనీయాంశమవుతోంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇది కూడా చదవండి: Pawan kalyan: ఏపీకి రండి.. సినీ పెద్దలకు పవన్ కళ్యాణ్ పిలుపు! ఇటీవల రాజ్ ఠాక్రే సోదరి కుమారుడి పెళ్లి ముంబయిలోని దాదర్‌లో జరిగింది. ఈ వేడకకు రాజ్ ఠాక్రే కుటుంబ సభ్యులతో కలిసి రాగా.. ఉద్దవ్ ఠాక్రే కూడా కుటుంబంతో సహా వచ్చారు. ఈ క్రమంలోనే పెళ్లిలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. రాజ్-ఉద్ధవ్ ఠాక్రేలు తమ కుటుంబ సభ్యులతో కలిసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సమయంలోనే సోదరులు ఉద్ధవ్, రాజ్ ఠాక్రేలు ఒకరినొకరు కలుసుకున్నారు. కాసేపు మాట్లాడుకున్నారు. Uddhav Thackeray #WATCH | Mumbai: Raj Thackeray, Uddhav Thackeray Seen At Wedding Of MNS Chief"s Nephew In Dadar; Videos Surface#UddhavThackeray #RajThackeray #MumbaiNews #ShivSenaUBT pic.twitter.com/vYWLOU5abt — Free Press Journal (@fpjindia) December 22, 2024 Also Read: రెండు రికార్డులు సృష్టించిన పక్షి.. 74 ఏళ్ల వయసులో ఇదేం విచిత్రం! ఇదిలాఉండగా.. బాల్ ఠాక్రేకు సొంత సోదరుడి కుమారుడే రాజ్ ఠాక్రే. ఉద్ధవ్ ఠాక్రేతో ఆయనకు విభేదాలు రావడంతో 2006లో శివసేన నుంచి బయటకి వెళ్లిపోయారు. 2009లో ఆయన నేతృత్వంలోని ఎమ్‌ఎన్‌ఎస్ పార్టీ 13 ఎమ్మె్ల్యే స్థానాల్లో గెలిచింది. అయితే 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పార్టీ తీవ్రంగా దెబ్బతింది. Also Read: బాల్య వివాహాలపై అస్సాం కఠిన చర్య.. మరో 416 మంది అరెస్టు 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ ఇద్దరి నేతలు విమర్శలు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రే వర్గంలోని శివసేన పార్టీ 20 స్థానాల్లో గెలిచింది. కానీ రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎమ్‌ఎన్‌ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. అయితే తాజాగా వీళ్లిద్దరు కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. Also Read: సైబర్ నేరాల్లో రూ.297 కోట్లు పోగొట్టుకున్న బాధితులు: సీవీ ఆనంద్