Pune woman murder: పట్టపగలే యువతిని నడిరోడ్డుపై కత్తితో పొడిచి పొడిచి! (వీడియో వైరల్)

పూణేలో పట్టపగలే దారుణం జరిగింది. కృష్ణ అనే యువకుడు నడిరోడ్డుపై శుభద అనే యువతిని కత్తితో పొడిచి చంపాడు. పలు కారణాలు చెప్పి ఆ యువతి అతడి వద్ద నుంచి రూ.4 లక్షలు తీసుకుంది. తిరిగి అడిగితే గొడవ చేసింది. కోపగ్రస్తుడైన కృష్ణ ఆమెను కత్తితో పొడిచి చంపాడు.

New Update
Pune woman murdered

Pune woman murdered

పూణేలోని యెరవాడ ప్రాంతంలో దారుణ ఘటన జరిగింది. ఓ యువకుడు పట్టపగలే ఒక మహిళను కత్తితో పొడిచి చంపాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. శివాజి నగర్‌కు చెందిన కృష్ణ సత్యనారాయణ కనోజా (30) - శుభదశంకర్ కోడారే (28) కలిసి బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (BPO)లో ఉద్యోగం చేస్తున్నారు. 

ఇది కూడా చూడండి: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!

డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్

28 ఏళ్ల శుభద శంకర్ కొడారే తన తండ్రి అనారోగ్యంతో ఉన్నాడంటూ అప్పుడప్పుడూ కృష్ణ కనోజా నుంచి రూ.4 లక్షలు వసూలు చేసింది.  అలా ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. ఇలా ఆమె తప్పుడు కారణాలు చెప్పి అతడి వద్ద నుంచి డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. 

ఇది కూడా చూడండి: అంతా రెప్పపాటులో జరిగిపోయింది..తిరుపతి ఘటన టైమ్ టు టైమ్ సీన్

ఇది కూడా చూడండి: ప్రభుత్వ వైఫల్యమే తొక్కిసలాటకు దారితీసింది: భూమన కరుణాకర్‌రెడ్డి

అయితే ఈ విషయాన్ని కృష్ణ తెలుసుకున్నాడు. దీంతో ఆమె తనను మోసం చేసిందని భావించాడు. అనంతరం తన డబ్బు తనకు ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశాడు. దీని కారణంగా వారిద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. 

ఇది కూడా చూడండి: తొక్కిసలాటకు కారణం అదే.. వెలుగులోకి షాకింగ్ నిజాలు!

ఇందులో భాగంగానే WNS గ్లోబల్ సర్వీసెస్ కంపెనీ పార్కింగ్ వద్దకు వెళ్లాడు. మరోసారి డబ్బులు అడిగాడు. అదే సమయంలో మళ్లీ వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో చిర్రెత్తిపోయిన ఆ యువకుడు ఆమెను ఒక పదునైన కత్తితో పొడిచాడు. అందరి ముందు పట్టపగలే నడి రోడ్డుపై ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఆ యువతి రక్తంతో రోడ్డుపై పడిపోయింది.

అయితే ఇంత జరుగుతున్నా చుట్టుపక్కల ఉన్నవారు అలా చూస్తూ ఉండిపోయారు. చివరికి ధైర్యం చేసి ఆమెను కత్తితో పొడిచిన వ్యక్తిని పట్టుకున్నారు. ఇదంతా ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు