శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 59 ప్రయోగం సక్సె్స్ అయ్యింది. గురవారం సాయంత్రం 4.04 గంటలకు నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన వాహన నౌక నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్.. ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలకు అభినందలను తెలిపారు. ప్రోబా-3 శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టామని ప్రకటించారు. అలాగే ప్రోబా చేపట్టబోయే తదుపరి ప్రయోగాలను ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 🚨 ISRO successfully launches PSLV-C59/PROBA-3 mission from Sriharikota, Andhra Pradesh. pic.twitter.com/7cVOZZGQvV — Indian Tech & Infra (@IndianTechGuide) December 5, 2024 Also read: కార్పొరేటర్ టూ సీఎం.. ఫడ్నవీస్ విజయ ప్రస్థానమిదే! ఎన్‌ఎస్‌ఐఎల్ భాగస్వామ్యంతో ఈ ప్రయోగం చేపట్టామని.. పీఎస్‌ఎల్‌వీకి మరిన్ని అవకాశాలు కల్పించిన ఈ సంస్థకు సోమనాథ్ ధన్యవాదాలు తెలిపారు. ఈ నెలలోనే స్పేటెక్స్ పేరుతో పీఎస్‌ఎల్‌వీ -సీ60 ప్రయోగం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఈ శాటిలైట్‌తోనే ఆదిత్య ఎల్-1 సోలార్ మిషన్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. Also Read: ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు ఇదిలాఉండగా.. యురోపియన్ స్పేస్ (ESA)కు చెందిన ప్రోబా-3తో సహా.. మరికొన్ని చిన్న శాటిలైట్లను పీఎస్‌ఎల్‌వీ-సీ59 రాకెట్ ద్వారా శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగం చేపట్టింది. ప్రోబా-3లో రెండు శాటిలైట్లు ఉన్నాయి. వీటి బరువు 550 కేజీలు. సూర్యుడి బయటి వాతావరణమైన కరోనాపై పరిశోధనలు చేసేందుకు ఈ ప్రయోగం చేపట్టారు. ఇందులో ఒక శాటిలైట్ కృత్రిమ సూర్యగ్రహణాన్ని సృష్టించనుంది. మరో ఉపగ్రహం సూర్యుని బాహ్య వలయం కరోనాని అధ్యయనం చేయనుంది. అయితే ఇలాంటి ప్రయోగం చేపట్టడం ప్రపంచంలోనే ఇది మొదటిసారి అని యురోపియన్ స్పేస్ ఏజెన్సీ పేర్కొంది. Also Read: ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ కేసు పిటిషన్ కొట్టివేత Proba-3 successfully lifted off from Satish Dhawan Space Centre on @isro's PSLV-XL on 5 December 2024.The double-satellite is the most ambitious member yet of our Proba family of experimental missions. Two spacecraft will fly together as one, maintaining precise formation down… pic.twitter.com/WKwFdyQ6CK — European Space Agency (@esa) December 5, 2024 Also Read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్ కంపెనీ..