బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(BPSC) పేపర్ లీక్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్నిరోజులుగా నిరాహర దీక్ష చేస్తున్న ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. తన బెయిల్ ఒప్పందం షరతులపై సంతకం చేసేందుకు పీకే నిరాకరించారు. దీంతో పోలీసులు ఆయన్ని జైలుకు తీసుకెళ్లారు. ఇదిలాఉండగా.. డిసెంబర్ 13న బీపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష పేపర్ లీకైనట్లు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. Also Read: ఆర్మీ కాన్వాయ్ పై ఆత్మాహుతి దాడి..47 మంది సైనికులు మృతి దీంతో ఆ పరీక్షలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. అభ్యర్థులకు మద్దతుగా పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రశాంత్ కిషోర్ జనవరి 2న గాంధీ మైదానంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. గత రెండు వారాల నుంచి పరీక్ష రద్దు చేయాలని బీపీఎస్సీ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారని.. అయినప్పటికీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. వెంటనే ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేసి మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. Also Read: పెరిగిన చలి.. రానున్న ఐదు రోజులు మరింత తీవ్రం అంటున్న అధికారులు గత నాలుగు రోజులుగా ప్రశాంత్ కిషోర్ గాంధీ మైదానంలో దీక్ష కొనసాగిస్తున్నారు. సోమవారం అక్కడికి వచ్చిన పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు. తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. చట్టవిరుద్ధంగా నిరసనలు చేస్తున్నందువల్లే ఆయన్ని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. అయితే బెయిల్ ఒప్పందం షరతులకు సంతకం చేసేందుకు పీకే నిరాకరించారు. దీంతో పోలీసులు ఆయన్ని జైలుకు తరలించారు. బీపీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్ కావడంపై ఆందోళనలు కొనసాగుతున్న వేళ.. పరీక్షను రద్దు చేసే ప్రసక్తే లేదని అధికారులు చెప్పారు. Also Read: కేరళలో ఘోర ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్