/rtv/media/media_files/2025/02/06/QtJzFIJg6mU54SUvb54j.jpg)
odisha cm
ఒడిశా (Odisha) ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ (Mohan Charan Majhi) గిరిజన మహిళల రంగు గురించి షాకింగ్ కామెంట్లు చేశారు. వాళ్ల రంగు నల్లగా ఉంటుందని.. చూసేందుకు అంద వికారంగా కనపడతారంటూ చీప్ కామెంట్లు చేశారు. తాను మొదటి నుంచి తెల్లగా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పిన ఆయన.. అందుకే గిరిజిన మహిళను వివాహం చేసుకోలేదంటూ ప్రజలందరి ముందే అన్నారు. ప్రస్తుతం ఈ విషయానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుండగా.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులంతా ముఖ్యమంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెల్లగా ఉన్న అమ్మాయినే...
ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో జరిగిన ఓ ఉత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ముఖ్య అతిథిగా వెళ్లారు . ఆ కార్యక్రమంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆయనకు ఆ జిల్లాకు సంబంధం ఎలా ఏర్పడిందో వివరించి మరీ గిరిజన మహిళల మేని ఛాయపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు యుక్త వయసు వచ్చినప్పటి నుంచి తెల్లగా ఉన్న అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉండేదని సీఎం అన్నారు.
Also Read: Trump Effect: ట్రంప్ ఆఫర్ ఎఫెక్ట్.. ఏకంగా 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా!
తెల్లగా ఉండరని.. వారి రంగు చాలా నల్లగా ఉంటుందని అన్నారు. చూసేందుకు కూడా వాళ్లు పెద్ద అందంగా ఉండరని వ్యాఖ్యానించారు. అందుకే తాను గిరిజన మహిళలను పెళ్లి చేసుకోవద్దని నిర్ణయించుకున్నానని.. ఈక్రమంలోనే మయూర్‌భంజ్ జిల్లాకు చెందిన ఓ అందమైన, తెల్లటి మేని ఛాయ కల్గిన అమ్మాయిని వివాహం చేసుకున్నట్లు వివరించారు. ఇలా తనకు మయూర్‌భంజ్ జిల్లాతో మంచి అనుబంధం ఏర్పడిందని వివరించారు.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. రాష్ట్ర ప్రజలు, గిరిజనన సంఘాలతో పాటు ఇతర రాజకీయ పార్టీ నాయకులంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గౌరవనీయ పదవిలో ఉండి ఇలా ప్రజల ముందు గిరిజన మహిళల రంగు గురించి, వారి అందాన్ని తక్కువ చేసి మాట్లాడడం చాలా బాధగా అనిపిస్తోందని వివరిస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి.. ఇలా మాట్లాడడం సిగ్గుచేటని చెప్పుకొస్తున్నారు. కావాలనే గిరిజన మహిళలను కించ పరిచేలా మాట్లాడిన ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ.. వెంటనే తన తప్పును గ్రహించి, ఆయన చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే గిరిజన మహిళలు అందరికీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Trump Effect: ట్రంప్ ఆఫర్ ఎఫెక్ట్.. ఏకంగా 40 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల రాజీనామా!