🔴Live Breakings: ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Mar 14, 2025 12:08 IST

    ఆరోగ్య శ్రీ రూల్స్ మార్పు.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

    ఆరోగ్య శ్రీ రూల్స్ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. క్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీకి వయసు పరిమితిని తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇది వరకు మూడేళ్ల వయస్సు ఉండగా ఇప్పుడు దాన్ని ఐదేళ్లకు పెంచుతూ ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఇవో కర్ణన్‌ వెల్లడించారు.

     CM Revanth Reddy
    CM Revanth Reddy

     



  • Mar 14, 2025 09:55 IST

    ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్

    ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ గా అక్షర్ పటేల్ పేరును ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. పటేల్ 2019 నుంచి ఢిల్లీ తరఫున ఆడుతున్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ లో 150 మ్యాచులు ఆడిన ఈ ఆల్ రౌండర్ .. 3758 రన్స్, 123 వికెట్లు తీశారు.

    Axar Patel



  • Mar 14, 2025 09:32 IST

    దారుణం... మద్యం మత్తులో 100 స్పీడ్తో కారు నడిపి.. మహిళ స్పాట్ డెడ్

    గుజరాత్ లోని వడోదరలో దారుణం జరిగింది. మద్యం మత్తులో కారు నడిపి ఓ యువకుడు బీభత్సం సృష్టించాడు.  100 కిలోమీటర్ల వేగంతో కారు నడిపి బైకర్స్ ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా నలుగురికి తీవ్రగాయాలయ్యాయి.

    car gujarat



  • Mar 14, 2025 09:30 IST

    XXX సోప్స్‌ అధినేత కన్నుమూత!

    ప్రముఖ పారిశ్రామికవేత్త, ట్రిపుల్ ఎక్స్ సోప్స్ ఛైర్మన్ అరుణాచలం మాణిక్యవేల్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం సాయంత్రం గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.

    xxx
    xxx

     



  • Mar 14, 2025 09:29 IST

    బాలకృష్ణ ఇంటి ముందు కారు బీభత్సం!

    జూబ్లీహిల్స్‌ రోడ్డు నెంబర్ 1లో శుక్రవారం తెల్లవారుజామున కారు బీభత్సం సృష్టించింది. హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇంటి ముందున్న ఫెన్సింగ్‌ను కారు బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని స్థానికులు చెప్తున్నారు.



Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు