UP: భోజనాలు లేటయ్యాయని..పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్న పెళ్లికొడుకు!

పెళ్లిలో భోజనాలు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగింది. పెళ్లికూతుర్ని వదిలేసిన తరువాత వరుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

New Update
Karthika masam: ఎంత ట్రై చేసినా పెళ్లి కావడం లేదా..అయితే కార్తీక మాసం లో ఇలా చేయండి మరీ!

up

Up: పెళ్లిలో భోజనాలు వడ్డించడంలో ఆలస్యమైందన్న కారణంతో పెళ్లిని క్యాన్సిల్‌ చేసుకున్నాడు ఓ యువకుడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో జరిగిందీ. పెళ్లి కూతురు, ఆమె కుటుంబాన్ని మండపంలోనే వదిలేసిన వరుడు.. అదే రోజు అతని బంధువు మెడలో తాళి కట్టాడు. దీంతో వధువు, ఆమె కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. పెళ్లికి ముందే వరుడి కుటుంబానికి రూ. 1.5 లక్షలు ఇచ్చామని తెలిపారు. 

Also Read: Daaku Maharaj: బాలయ్య ఫ్యాన్స్ కు న్యూ ఇయర్ గిఫ్ట్.. 'డాకు మహారాజ్' నుంచి మాస్ సాంగ్

 మెహతాబ్‌తో బాధిత యువతికి ఏడు నెలల క్రితమే నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 22న పెళ్లి ఊరేగింపు వధువు స్వగ్రామమైన హమీద్‌పూర్ గ్రామానికి వచ్చింది. తాను అప్పటికే రెడీగా ఉన్నానని, పెళ్లి కొడుకు, ఆమె కుటుంబ సభ్యులు విందు ఆరగించిన తర్వాత తన తల్లిదండ్రులను దుర్భాషలాడటమే కాకుండా కొట్టి పెళ్లి మండపం నుంచి వెళ్లిపోయారని బాధిత వధువు పోలీసులకు తెలిపింది.

Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై

పెళ్లికొచ్చిన వారు భోజనాలు చేయడానికి కూర్చున్నారని,ఆ సమయంలో మెహతాబ్‌కు వడ్డించడంలో కొంత ఆలస్యమైన మాట వాస్తవమేనని వధువు చెప్పింది. ఈ విషయంలో అతడి స్నేహితులు హేళన చేయడంతో అవమానానికి గురైన మెహతాబ్ వధువు కుటుంబంతో గొడవ పడ్డాడు. అది మరింత ముదరడంతో చేయి కూడా చేసుకున్నాడు. గ్రామస్థులు వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోలేదు. 

Also Read: Cumin, Jaggery: జీలకర్ర-బెల్లం నీటిని రోజూ తీసుకుంటే అద్భుత ప్రయోజనాలు

పెళ్లి చేసుకునేందుకు నిరాకరించిన మెహతాబ్ కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. వధువు కుటుంబ సభ్యులు షాక్‌లో ఉండగానే అదే రోజు మెహతాబ్ తన కజిన్‌ను పెళ్లి చేసేసుకున్నాడు.పెళ్లి రద్దు చేసుకున్న మెహతాబ్, ఆయన కుటుంబంపై ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ వధువు కుటుంబం తాజాగా ఎస్పీని కలిసి తమ గోడు చెప్పుకుంది.

Also Read: Mann ki Baat: మన్‌కీ బాత్‌లో ఏఎన్నార్ ప్రస్తావన.. ఎన్టీఆర్‌ను మర్చిపోయిన మోదీ

పెళ్లి రద్దు కావడంతో తాము రూ. 7 లక్షలు నష్టపోయినట్టు వివరించారు. అలాగే, వరుడి కుటుంబానికి రూ. 1.5 లక్షలు ఇచ్చినట్టు తెలిపారు. కాగా, వరుడి కుటుంబం రూ. 1.61 లక్షలు తిరిగి చెల్లించేందుకు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు