BIG BREAKING: గ్యాస్‌ వినియోగదారులకు అలెర్ట్.. కేంద్రం సంచలన ఆదేశాలు

LPG, PNG గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్‌ కనెక్షన్ మాత్రమే ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే తిరిగి ఇవ్వాలని చెప్పింది.

New Update
Govt directs households with both PNG and LPG connection to surrender their LPG connection

Govt directs households with both PNG and LPG connection to surrender their LPG connection

 LPG, PNG గ్యాస్ వినియోగదారులకు బిగ్ షాక్ తగిలింది. వినియోగదారుల వద్ద ఒక గ్యాస్‌ కనెక్షన్ మాత్రమే ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఒకవేళ రెండో గ్యాస్ కనెక్షన్ ఉంటే తిరిగి ఇవ్వాలని చెప్పింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో చాలా దేశాల్లో గ్యాస్, చమురు, ఎరువుల కొరత నెలకొంది. ఈ సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆయా దేశాలు కఠిన రూల్స్‌ అమలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా భారత్‌ కూడా LPG, PNG గ్యాస్ కనెక్షన్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  

Also Read: గ్యాస్ సిలిండర్ పేలి ఇద్దరు చిన్నారులు మృతి.. ఏడుగురికి తీవ్ర గాయాలు!

దేశంలో ప్రస్తుతం చాలా ఇళ్లకు PNGతో పాటు LPG కనెక్షన్లు ఉన్నాయి. వినియోగదారులకు ఇవి సౌకర్యంగా ఉన్నా కూడా సబ్సిడీల లబ్ధి విషయంలో దుర్వినియోగం జరుగుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఈ నేపథ్యంలో ఒక ఇంటికి ఒకే ఇంధన కనెక్షన్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 

Also Read: వీసా కోసం వింత డ్రామా.. అమెరికాలో 11 మంది భారతీయులు అరెస్ట్!

PNG గ్యాస్ కనెక్షన్‌లు ఉన్న ఇళ్లు వెంటనే LPG కనెక్షన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఇకనుంచి సబ్సిడీ కూడా ఒక కనెక్షన్‌కే వర్తిస్తుంది. పీఎన్‌జీ కనెక్షన్ ఉన్నవాళ్లకి ఎల్‌పీజీ సబ్సిడీ ఉండదు. ఎల్‌పీజీ కనెక్షన్‌ సమర్పించాకా పీఎన్‌జీ నుంచి గ్యాస్‌ సరఫరా నిరంతరం కొనసాగుతుంది. ఇంధన వినియోగంలో పారదర్శకత ఉంటుంది. దీనివల్ల అక్రమ గ్యాస్ కనెక్షన్లు కూడా తగ్గుతాయి. అయితే కేంద్రం తీసుకున్న నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు PNG కనెక్షన్ ఉన్నవాళ్లు LPG అవసరం లేదని చెబుతున్నారు. కానీ ఎమర్జెన్సీ పరిస్థితుల్లో LPG సౌకర్యం లేకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని మరికొందరు చెబుతున్నారు.      

Advertisment
తాజా కథనాలు