/rtv/media/media_files/2026/03/16/fasttag-2026-03-16-07-35-39.jpg)
సొంత వాహనాలపై నేషనల్ హైవేలపై నిత్యం ట్రావెల్ చేసేవారికి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ఫాస్టాగ్ వార్షిక పాస్(FASTag Annual Pass) ధరను పెంచుతున్నట్లు NHAI ప్రకటించింది. పెరిగిన ఈ కొత్త ధరలు ఏప్రిల్ 1 నుండి అమల్లోకి రానున్నాయి. ప్రస్తుతం రూ. 3,000 గా ఉన్న ఈ పాస్ ధర ఇకపై రూ. 3,075 కానుంది. అంటే మరో 75 రూపాయలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.2008 నాటి జాతీయ రహదారుల రుసుము నిబంధనల ప్రకారమే ఈ ధరల సవరణ జరిగినట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన ఈ వార్షిక పాస్ స్కీమ్, కేవలం కారులు, జీపులు, వ్యాన్లు వంటి వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాలకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ పాస్ ద్వారా ఏడాది కాలంలో లేదా 200 టోల్ క్రాసింగ్‌ల వరకు ప్రయాణించవచ్చు. ఇప్పటికే సుమారు 56 లక్షల మంది వాహనదారులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారని, దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 1,150 టోల్ ప్లాజాల వద్ద ఈ పాస్ చెల్లుబాటు అవుతుందని అధికారులు తెలిపారు.
Also Read : ఐసీయూలో అగ్నిప్రమాదం: 10 మంది రోగుల మృతి!
ఆన్‌లైన్‌లో పాస్ ఎలా పొందాలి?
ఈ వార్షిక పాస్‌ను పొందాలనుకునే వారు రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ వాహనం నంబర్, ఫాస్టాగ్ ఐడీతో లాగిన్ అయి, నిర్దేశించిన రుసుమును యూపీఐ (UPI), డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. డబ్బులు చెల్లించిన రెండు గంటల్లోనే ఈ పాస్ మీ ఫాస్టాగ్‌కు అనుసంధానం అవుతుంది. దీనికి సంబంధించిన సమాచారం మీకు ఎస్ఎంఎస్ ద్వారా అందుతుంది. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పాస్ పొందే సమయానికి మీ ఫాస్టాగ్ యాక్టివ్‌గా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువగా చేసే వారికి విడివిడిగా డబ్బులు కట్టడం కంటే ఈ వార్షిక పాస్ తీసుకోవడం వల్ల సమయం, డబ్బు ఆదా అవుతాయి.
Also Read : మా ఎమ్మెల్యేలను కొనాలనుకున్నారు.. ఒక్కొక్కరికి రూ.5 కోట్లు ఇచ్చారు.. డీకే సంచలన కామెంట్స్!
Follow Us