DMK: అప్పటికీ పవన్ ఇంకా పుట్టలేదేమో..డీఎంకే

త్రిభాష మీద డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం అవుతున్నాయి. దీనిపై డీఎంకే కౌంటరిచ్చింది. త్రి భాష విధానాన్ని పవన్ తప్పుగా అర్ధం చేసుకున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.

New Update
pawan

Pawan Kalyan, DMK

నిన్న జరిగిన జనసేన 12వ ఆవిర్భావ సభలో పవన్ త్రిభాషా విధానం గురించి మాట్లాడారు. బహు భాషలే భారతదేశానికి మంచిది. తమిళనాడు సహా అన్ని రాష్ట్రాలకు ఒకే సిద్ధాంతం ఉండాలని స్పీచ్ ఇచ్చారు పవన్ కల్యాణ్. అయితే ఈ వ్యాఖ్యలు సంచలనానికి దారి తీస్తున్నాయి. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ లాంటి వారు ట్విట్టర్ లో కౌంటర్లు ఇచ్చారు. ఇప్పుడు ఏకంగా డీఎంకే పవన్ మాటల మీద కౌంటర్ ఎటాక్ స్టార్ట్ చేసింది. 

పవన్ పుట్టలేదనుకుంటా..

త్రిభాషా విధానం గురించి మాట్లాడుతూ తమిళ సినిమాలను హిందీలో ఎందుకు డబ్బింగ్ చేస్తున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై డీఎంకే మండిపడుతోంది పవన్ త్రిభాషా విధానానని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ డీఎంకే పార్టీ నేత సయీద్ హఫీజుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తమపై బలవంతంగా హిందీ భాషను రుద్దుతోంది. దాన్ని మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నాం. తమిళనాడులో ద్విభాషా విధానాన్ని ఎప్పటి నుంచో పాటిస్తోంది. దీనిపై బిల్లును 1968లోనే మా అసెంబ్లీ పాస్ చేసింది...అప్పటికి పవన్ ఇంకా పుట్టలేదేమో అని హఫీజుల్లా సెటైర్ వేశారు. 

నేను అలా చెప్పలేదు..

 హిందీ భాషను తాను ఏ రోజు వ్యతిరేకించలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు. నిర్భందంగా అమలు చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించానంటూ వివరంగా పోస్ట్ పెట్టారు. కొంతమంది కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు.  NEP-2020 హిందీని కంపల్సరీ చేయాలని చెప్పలేదన్నారు. ఆ పాలసీ ప్రకారం మాతృభాష, మరో భారతీయ భాష, ఒక అంతర్జాతీయ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. హిందీని చదవడం ఇష్టం లేకపోతే మిగతా భాషలు నేర్చుకోవచ్చని వివరిస్తూ పోస్ట్ పెట్టారు. ఒక భాషను బలవంతంగా విధించడం లేదా ఒక భాషను గుడ్డిగా వ్యతిరేకించడం.. రెండూ మన భారత్ జాతీయ & సాంస్కృతిక ఏకీకరణ లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడవు. హిందీని ఒక భాషగా నేను ఎప్పుడూ వ్యతిరేకించలేదు. నేను దానిని తప్పనిసరి చేయడాన్ని మాత్రమే వ్యతిరేకించాను అని పవన్ చెప్పుకొచ్చారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు