BREAKING: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణణ్ ఆయనచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా హాజరయ్యారు.

New Update
devendra FADNAVIS

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సీపీ రాధాకృష్ణణ్ ఆయనచే ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, జేపీ నడ్డా హాజరయ్యారు. అలాగే యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్, బిహార్ సీఎం నితీష్‌ కుమార్ సహా పలువురు సీఎంలు, కేంద్రమంత్రులు కూడా హాజరయ్యారు. ఇక డిప్యూటీ సీఎంగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే అజిత్ పవార్ కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. 

Also Read: ఎంపీ ధర్మపురి అరవింద్‌కు బిగ్ షాక్.. ఎస్సీ, ఎస్టీ కేసు పిటిషన్ కొట్టివేత

ఈ కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులతో పాటు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్‌ బాలివుడ్ సెలబ్రిటీలు షారుఖ్‌ఖాన్, సల్మాన్ ఖాన్‌ కూడా హాజరయ్యారు. అలాగే ముఖేష్ అంబానీ, కుమార్ మంగళం బిర్లాతో పాటు వివిధ వ్యాపార దిగ్గజాలు కూడా ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. 

Also Read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్‌ కంపెనీ..

ఇదిలాఉండగా.. దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సీఎం ఎవరు అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గత కొన్ని రోజులుగా సీఎం ఎంపికపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. చివరికి బీజేపీ నేత ఫడ్నవీస్‌కే హైకమాండ్ సీఎం బాధ్యతలు అప్పగించింది. 

బుధవారం ముంబయిలో నిర్వహించిన బీజేపీ కోర్‌కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రిగా ఫడ్నవీస్ పేరు ఖరారు చేశారు. అలాగే శివసేన నేత ఏక్‌నాథ్‌ షిండే, ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌కు డిప్యూటీ సీఎం బాధ్యతలు అప్పగించింది. అజిత్ పవార్ డిప్యూటీ సీఎం అవుతారని ముందే క్లారిటీ వచ్చింది. కానీ షిండే విషయంలో దీనిపై ప్రతిష్టంభన కొనసాగింది. ఎన్నికల ఫలితాల రోజున షిండే.. సీఎం మార్పు ఉండదని చెప్పడం సంచలనం రేపింది. ఆ తర్వాత సీఎం ఎంపికపై ప్రధాని మోదీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కూడా చెప్పారు. ఇక చివరికి ఈ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడంతో హైకమాండ్‌ బీజేపీ నేత ఫడ్నవీస్‌కే సీఎం పదవి అప్పగించేందుకు మొగ్గు చూపింది. 

ఇది కూడా చదవండి: పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం ఇష్యూ.. ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు!

Also Read: కన్న తల్లిదండ్రులను, అక్కను కత్తితో పొడిచి పొడిచి.. ఎంత క్రూరంగా చంపాడంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు