Delhi: పొగమంచు ఎఫెక్ట్‌.. 200 విమాన సర్వీసులు ఆలస్యం!

ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలపై పొగమంచు కమ్మేసింది.దీంతో విమాన,రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టు లో విజిబిలిటీ సున్నాకు పడిపోయింది.దాదాపు 200 లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

New Update
Airlines : విమానంలో అలాంటి పని చేసినందుకు మహిళకు రూ.68 లక్షల జరిమానా!

Delhi : ఉత్తర భారతం పై చలి పులి తన ప్రతాపాన్ని చూపుతోంది.రోజురోజుకి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి.మంచు దట్టంగా కురుస్తోంది.ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాలపై పొగమంచు కమ్మేసింది.దీంతో విమాన,రైల్వే సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ ఎయిర్‌ పోర్టు  లో విజిబిలిటీ సున్నాకు పడిపోయింది. దీంతో విమానాశ్రయంలో సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Also Read: BIG BREAKING: హోంమంత్రి పీఏపై అవినీతి ఆరోపణలు.. సర్కార్ సంచలన నిర్ణయం!

200 లకు పైగా విమానాలు...

ఫలితంగా దాదాపు 200 లకు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అంతేకాకుండా మరో 30 విమానాలను రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు.పొగమంచు కారణంగా ఎయిర్‌పోర్టులో విమానాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది.విమానా సమయాల కోసం ప్రయాణికులు ఎప్పటికప్పుడు సంబంధిత ఎయిర్‌ లైన్లను సంప్రదించాలి అని ఎయిర్‌ పోర్టు అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

Also Read: Telangana: విపరీతంగా పెరుగుతున్న చలి తీవ్రత..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌

అటు ఇండిగో, ఎయిర్‌ ఇండియా సంస్థలు కూడా ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. అటు కోల్‌కతా ,చండీగడ్‌, అమృత్‌సర్‌, జైపూర్‌ సహా ఉత్తర భారతం లోని పలు విమానాశ్రయాల్లోనూ ఇదే  పరిస్థితి నెలకొంది.కోల్‌కతా ఎయిర్‌ పోర్టులో 25 విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. మరో పక్క రైల్వే సేవలు కూడా నెమ్మదిగా సాగుతున్నాయి.

మంచు కారణంగా ఢిల్లీ వెళ్లే దాదాపు 50 కి పైగా రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్‌, కర్నాల్‌ గాజియాబాద్‌ ప్రాంతాల్లో ఎదురుగా ఉన్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఉంది.

దీంతో వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడి పలుచోట్ల ట్రాఫిక్‌ సమస్య  తలెత్తింది.ఢిల్లీలో శనివారం తెల్లవారుజామున 10.2డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇప్పటికే వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. జనవరి 8 వ తేదీ వరకు దేశ రాజధానిలో మంచు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అంచనా వేస్తోంది. 

Also Read: Ap: తల్లికి వందనం పథకం ముహూర్తం కుదిరింది..మంత్రి కీలక వ్యాఖ్యలు!

Also Read: Tg: నిజామాబాద్ టెన్త్ స్టూడెంట్స్‌ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు