గత కొంతకాలంగా వాయు కాలుష్యంలో చిక్కుకున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట లభించింది. తాజాగా అక్కడి గాలి నాణ్యత సూచి(AQI)లో మెరుగుదల కనిపించింది. కాలుష్యాన్ని నియంత్రించేందుకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP) విధించిన రూల్స్ సత్ఫలితాలను ఇచ్చాయి. దీంతో ఈ ఆంక్షల సడలింపునకు సుప్రీంకోర్టు పర్మిషన్ ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్, హర్యానాలో పంట వ్యర్థాలు తగలబెట్టడం వల్ల ఏటా శీతాకారం ప్రారంభంలో ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది. Also Read: PSLV-C59 ప్రయోగం సక్సెస్.. శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపిన సోమనాథ్ ఈసారి కూడా అలానే జరగడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 ఆంక్షలు విధించింది. అయితే తాజాగా ఎయిర్ క్వాలిటీలో మెరుగదల కనిపించడంతో సుప్రీంకోర్టు ఆంక్షల సడలింపునకు అనుమతి ఇచ్చింది. దీంతో ఢిల్లీ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే పంట వ్యర్థాలను పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించేలా ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటామని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఇదిలాఉండగా.. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(AQI) 0-50 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగుందని అర్థం. 51-100 మధ్య ఉండే సాధారణ స్థితి, 101-200 ఉంటే క్షీణ దశకు చేరువలో ఉందని అర్థం. ఇక 201-300 ఉంటే గాలి నాణ్యత క్షీణించిందని, ఇక 400 సూచి దాటితే తీవ్రంగా క్షీణించినట్లు సూచిస్తుంది. ఢిల్లీలో గత కొన్నిరోజులుగా 400లకు పైగానే గాలి నాణ్యత ఉంది. దీంతో అక్కడ చాలామంది అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Also Read: ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు–సంభాల్ అల్లర్లపై సీఎం యోగి వ్యాఖ్యలు ఢిల్లీలో గాలి నాణ్యతను మెరుగుపర్చాలనే ఉద్దేశంతో కృత్రిమ వర్షాన్ని కురిపించాలని ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. కానీ ఇది కుదరలేదు. చివరికి జీఆర్‌ఏపీ విధించిన ఆంక్షలు ఫలించాయి. అయినప్పటికీ ప్రతీ సంవత్సరం ఢిల్లీలో ఇలా గాలి నాణ్యత విపరీతంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. Also Read: తెలంగాణలో 40 వేల కోట్ల విలువైన భూకబ్జా.. మాజీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు ఇది కూడా చదవండి : బీజేపీ, బీఆర్‌ఎస్‌కు బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి కీలక నేతలు