Delhi Assembly Poll : నేడు ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్.. ప్రకటించనున్న ఈసీ

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 23తో ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడగానే  కోడ్ అమల్లోకి రానుంది

New Update
delhi poll

delhi poll Photograph: (delhi poll)

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను మధ్యాహ్నం 2 గంటలకు ఎన్నికల సంఘం ప్రకటించనుంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీ పదవీకాలం ఫిబ్రవరి 23తో ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడగానే  కోడ్ అమల్లోకి రానుంది. ఢిల్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 6న ఓటింగ్ నిర్వహించి, ఫిబ్రవరి 8న ఫలితాలు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఢిల్లీలో ఈ ఎన్నికలు ఒకే దశలో జరిగే అవకాశం ఉంది. 

Also Read :  40 ఏళ్ల నిరీక్షణ .. బీహార్ మహిళకు భారత పౌరసత్వం

త్రిముఖ పోరు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో (Delhi Assembly Elections) బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోరు కనిపిస్తుంది. వరుసగా మూడోసారి ఎన్నికల్లో విజయం సాధించాలని ఆప్‌ లక్ష్యంగా పెట్టుకుంది. దేశ రాజధానిని తిరిగి దక్కించుకోవాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది.  ఆప్ ను గద్దెదించి ఈ సారి అధికారంలోకి రావాలని  బీజేపీ భావిస్తోంది. ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ లిక్కర్ స్కామ్ లో  అరెస్టై, రిలీజ్ అయిన తరువాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ఆసక్తికరంగా మారింది. ఆటో డ్రైవర్లకు రూ. 10 లక్షల బీమాను ప్రకటించి కేజ్రీవాల్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.  అంతేకాకుండా కొండ్లీ నియోజకవర్గంలో ఆటో డ్రైవర్ కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన ఆయన.. ఆటో డ్రైవర్ల కుమార్తెల పెళ్లికి రూ. 1 లక్ష సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.

Also Read :  Bengaluruలో విషాదం.. పిల్లలకు విషం ఇచ్చి.. భార్యాభర్తలు ఆత్మహత్య

2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో జనవరి 6న షెడ్యూల్ వెల్లడైంది, ఫిబ్రవరి 8న పోలింగ్ జరిగింది.  ఫిబ్రవరి 11న ఫలితాలు లెక్కించబడ్డాయి. ఆ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ఘన విజయం సాధించింది. ఇక్కడ మొత్తం 70 సీట్లకు గాను ఆప్ 62 సీట్లు గెలుచుకోగా, బీజేపీ కేవలం 8 సీట్లు మాత్రమే గెలుచుకుంది.  కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఒక్క అభ్యర్థి కూడా గెలవలేకపోయారు.

కాగా  ఢిల్లీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (CEO) 2025 జనవరి 6వ తేదీన  తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు, మొత్తం ఓటర్ల సంఖ్య 1.55 కోట్లుగా ఉంది. అక్టోబర్ 29, 2024న డ్రాఫ్ట్ రోల్‌ను ప్రచురించినప్పటి నుండి 1.67 లక్షల (1.09%) కొత్త పేర్లు రోల్‌లో చేర్చబడ్డాయని  ఆలిస్ వాజ్ కార్యాలయం పేర్కొంది.  

Also Read :  PM మోదీతో నాదేళ్ల భేటీ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై చర్చ

Also Read :  దేశంలో కొత్త వైరస్ వ్యాప్తి.. ఏపీ ఆరోగ్యశాఖ అలర్ట్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు