/rtv/media/media_files/2025/02/06/df4cnO3ee8UY6hY7Bd11.jpg)
AAP MP Sanjay Singh made sensational allegations against BJP
Delhi: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీని చీల్చేందుకు బీజేపీ కుట్రలు చేస్తోందన్నారు. ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఒక్కొక్కరికి రూ.15కోట్లు చొప్పున ఆఫర్ చేస్తున్నారని, ఇప్పటికే ఏడుగురిని కలిసి డీల్ మాట్లాడినట్లు చెప్పారు. \
ఒక్కొక్కరికి రూ.15కోట్లు..
ఈ మేరకు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. కాగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ బీజేపీపై పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ‘అన్ని రాష్ట్రాల్లో మాదిరిగానే ఓట్ల లెక్కింపుకు ముందే బీజేపీ ఓటమిని ఒప్పుకుంది. ఢిల్లీలోనూ పార్టీలను విచ్ఛిన్నం చేసేందుకు కుట్రలు పన్నుతోంది. 7గురు ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీలో చేరాలంటూ ఫోన్ కాల్స్ వచ్చాయి. ఒక్కొక్కరికి రూ.15కోట్లు ఇస్తామని ఆఫర్ చేస్తు్న్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
8వ తేదీన తుది ఫలితాలు..
ఇక ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగింది. 8వ తేదీన తుది ఫలితాలు వెల్లడికానున్నాయి. మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఈసారి ఢిల్లీ పీఠం బీజేపీదేనని తేల్చి చెప్పాయి. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో 699 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. చాణక్య స్ట్రాటజీస్ ప్రకారం బీజేపీకి 39-44, పీపుల్ పల్స్ 51-60, మ్యాట్రిజ్ 35-40, పీపుల్స్ ఇన్ సైట్ 40-44, రిపబ్లిక్ పీ మార్క్ 39-49, పోల్ డైరీ 42-50, జేవీసీ పోల్ 39-45 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. ఇక కేకే సర్వే మాత్రం ఆప్ కు 39, బీజేపీకి 22 సీట్లు వస్తాయని అంచనా వేసింది.
ఇది కూడా చదవండి: Indian Migrants: వలసదారుల భద్రత కోసం కొత్త చట్టం.. ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు!
ఇక నార్త్-ఈస్ట్ ఢిల్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 52.73శాతం పోలింగ్ నమోదైంది. న్యూఢిల్లీలో అత్యల్పంగా 43.1శాతం పోలింగ్ నమోదైంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఢిల్లీ సీఎం ఆతిశీ, కేంద్ర మంత్రి జై శంకర్, రాహుల్ గాంధీ, కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సహా పలువురు ప్రముఖులు తొలి గంటల్లోనే ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..