Delhi Assembly Elections: ఫిబ్రవరి 5న ఢిల్లీ ఎన్నికలు

ఢిల్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేస్తోంది. ఫిబ్రవరి 5న ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపింది. జనవరి 20 నామినేషన్ విత్‌డ్రాకు గడువు ఇవ్వగా.. జనవరి 17 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల చేస్తారు.

author-image
By Nikhil
New Update

Delhi Assembly Elections: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల కమిషన్(Election Commission of India) షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 70 నియోజకవర్గాలకు ఫిబ్రవరి 23లో ప్రస్తుత అసెంబ్లీ టర్మ్ ముగుస్తోంది. దీంతో ఒకే విడతలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా.. ఫిబ్రవరి 5న పోలింగ్(Delhi Election Polling Date) నిర్వహిస్తారు. ఫిబ్రవరి 8న ఫలితాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం చీప్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. ఢిల్లీ ఎన్నికల్లో కొన్ని చోట్ల రాత్రి 8 గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. జనవరి 17 వరకు నామినేషన్ దాఖలు చేయవచ్చు. నామినేషన్ విత్‌డ్రాకు చివరి తేది జనవరి 20గా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.

ఢిల్లీలో 1.55 కోట్ల ఓటర్లు ఉన్నారని, వీరిలో 83.49 లక్షల పురుషలు, 71.74 లక్షల మహిళలు ఉన్నారని ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా విడుదల చేసింది. ఢిల్లీలో13,033 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.

Also Read :  ఈ రాశివారికి ఈరోజు డబ్బే డబ్బు..

ఆరోపణలను ఖండించిన ఈసీ(ECI)

నిర్దిష్ట గ్రూపులను టార్గెట్ చేసుకుని ఓటర్ల జాబితాలో వారి పేర్లు తొలగించడం, కొందరి పేర్లు చేర్చడం జరిగిందని రాజకీయ పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని రాజీవ్ కుమార్ తోసిపుచ్చారు. ఈవీఎంల గురించి సమాధానం ఇచ్చిన తర్వాత కూడా కొందరు ఈవీఎంల అవకతవకలపై మాట్లాడుతున్నారని అన్నారు. ఈవీఎంలలో వైరస్, బగ్‌ కానీ, చెల్లని ఓట్లు కానీ ఉండవని, రిగ్గింగ్‌కు అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇండియాలో 99 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లు ఉన్నారని, ఓటింగ్, మహిళా పార్టిసిపేషన్‌లో ఎన్నికల సంఘం కొత్త రికార్డులు సృష్టించిందని, త్వరలో 100 కోట్ల రిజిస్టర్డ్ ఓటర్లతో సరికొత్త రికార్డు నమోదు కానుందని చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య 48 కోట్లు దాటడం దేశంలో మహిళా సాధికారతను బలంగా చాటుతోందన్నారు ప్రధాన ఎన్నికల కమిషనర్. 

Also Read :  ఈ 8 అలవాట్లు మీ విలువను తగ్గిస్తాయి

2020 అసెంబ్లీ ఎన్నికల్లో 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్ 62 స్థానాలు గెలుచుకుని విజయభేరి మోగించింది. బీజేపీ 8 సీట్లు దక్కించుకుంది. 2013, 2015, 2020లో జరిగిన ఎన్నికల్లో ఆప్ విజయం సాధించి వరుసగా నాలుగో సారి ఢిల్లీలో పాగా వేసేందుకు పావులు కదుపుతోంది. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వడంటూ అభివృద్ధి మంత్రంతో ఈసారి ఎన్నికల్లో బీజేపీ ప్రజల ముందుకు వెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ సైతం బీజేపీ, ఆప్ ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నందున కాంగ్రెస్ ఒక్కటే ప్రత్యామ్నాయమని, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. అటు ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీలు, మీటింగులతో ఢిల్లీలో ఎన్నికల హీట్ మొదలైంది.

Also Read: America: భీక‌ర‌ మంచు తుఫాన్ తో వణుకుతున్న అమెరికా..7 రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు