BIG BREAKING: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. వరికి మద్దతు ధర పెంపు

బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మోదీ సర్కార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది.

New Update
Central Cabinet Meeting

Central Cabinet Meeting

బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మోదీ సర్కార్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ.37,500 కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి ఆమోదం తెలిపింది. ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. ఇందుకోసం రూ.2 లక్షల 60 వేల కోట్లు కేటాయించనుంది. అలాగే పెట్టుబడి ఖర్చుకు 50 శాతం కలిపి రేటు నిర్ధారించనున్నారు. విర కనీస మద్దతు ధర రూ.2,441గా నిర్ణయించింది. వరి గ్రేడ్-ఏ రకానికి మద్దతు ధర రూ.2,461గా నిర్ణయించింది.

Also Read: విజయ్‌ సంచలన నిర్ణయం.. ఆయన నియామకం రద్దు

అలాగే నాగ్‌పూర్ ఎయిర్‌పోర్టు ఆధునీకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. కోల్ గ్యాసిఫికేషన్‌తో LNG దిగుమతి భారం తగ్గుతుందని కేంద్రం తెలిపింది. భారత్‌లో 401 బిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు పేర్కొంది. 400 ఏళ్లకు సరిపడా ఈ నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేసింది. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు అంచనా వేస్తున్నట్లు పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు