blood moon: రక్తంతో ఎరుపెక్కిన చంద్రుడు.. బ్లడ్ మూన్ చూడొచ్చా!

మార్చి 13 రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. చంద్రుడు రక్తంతో ఎరుపెక్కినట్లు కనిపిస్తాడు. అందుకే ఈ రోజు వచ్చే చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఎర్రగా కనిపిస్తోంది. కానీ భారత్‌లో ఉన్నవారికి ఇది వీక్షించేందుకు వీలు లేదు.

author-image
By K Mohan
New Update
blood moon

blood moon Photograph: (blood moon)

మార్చి 13 రాత్రి ఆకాశంలో అద్భుతం జరగనుంది. ఈ మార్చి ఒక్క నెలలోనే రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి. మార్చి 18న చంద్రగ్రహ‌ణం ఏర్పడ‌నుండ‌గా..  29న పాక్షిక సూర్యగ్రహ‌ణం ద‌ర్శన‌మివ్వనున్నది. వాస్తవానికి ఈ ఏడాది రెండు సూర్య, రెండు చంద్రగ్రహ‌ణాలు ఉంటాయి. ఒక సూర్యగ్రహాలు, చంద్రగ్రహ‌ణం మాత్రమే ఇండియా నుంచి చూడవచ్చు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహ‌ణం మార్చి 13, 14తేదీల మ‌ధ్య సంభ‌వించ‌నున్నది. ఆకాశంలో చంద్రుడు రక్తంతో ఎరుపెక్కినట్లు కనిపిస్తాడు. అందుకే ఈ రోజు వచ్చే చంద్రుడిని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. ఈ సంఘటన 2022 తర్వాత మొదటి సంపూర్ణ చంద్రగ్రహణాన్ని సూచిస్తుంది. ఇది సంపూర్ణ చంద్రగ్రహ‌ణం అయినప్పటికీ  భార‌త్‌లో మాత్రం క‌నిపించే అవ‌కాశం లేదు.

Also read: Paris: బట్టలు లేకుండా రోడ్లెక్కి మహిళల నిరసన.. ఎందుకంటే?

ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, ద‌క్షిణ అమెరికా, ప‌సిఫిక్ మ‌హాస‌ముద్రం, అట్లాంటిక్ మ‌హాస‌ముద్రం, ఆర్కిటిక్ మ‌హాస‌ముద్రం, తూర్పు ఆసియా, అంటార్కిటికాలో మాత్రమే ఈ చంద్రగ్రహణాన్ని చూడవచ్చు. 

Also read: Cryptocurrency Fraud: 96 బిలియన్ డాలర్ల స్కాం.. ఇంటర్‌నేషనల్ క్రిమినల్‌ని అరెస్ట్ చేసిన కేరళ పోలీసులు

 

ఎందుకంటే మన దేశంలో ఈ గ్రహణం ఉదయం వేళల్లో సంభవిస్తుంది. ఈ గ్రహణం మన దేశంలో మార్చి 14న ఉదయం 9.27 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగనుంది. EDT సమయం ప్రకారం ఈ చంద్రగ్రహణం మార్చి 13న రాత్రి 11.57 గంటలకు ప్రారంభమై మార్చి 14న ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. EDT సమయం భారత సమయం కంటే 9.5 గంటలు వెనకబడి ఉందని గమనించాలి.

సూర్యుడు, చంద్రుడి మధ్యలో భూమి వచ్చినప్పుడు చంద్రగ్రహణం సంభవిస్తుంది. ఆ సమయంలో చంద్రుడు భూమి నీడలో ఉంటాడు. దీంతో డైరెక్ట్ సన్​లైట్ చంద్రుడిని చేరుకోదు. సూర్యకాంతిలో తక్కువ తరంగదైర్ఘ్యాలు కలిగిన బ్లూ లైట్ సులభంగా చెల్లాచెదురుగా పోతుంది. కానీ రెడ్, ఆరెంజ్ కాంతి.. దీర్ఘ తరంగదైర్ఘ్యాల వలె భూమి దట్టమైన వాతావరణంలోకి చొచ్చుకుపోయి చంద్రుని ఉపరితలం చేరుకుంటుంది. ఆ ఆరెంజ్, రెడ్ కలర్స్ భూమిపై పడటం వల్ల అది బ్లడ్​ కలర్​లో కనిపిస్తుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు