/rtv/media/media_files/2026/03/15/vijay-2026-03-15-14-44-17.jpg)
BJP offers Deputy CM post to Vijay, 80 seats to TVK for Tamil Nadu polls, Says Sources
తమిళనాడు(tamilnadu), అస్సాం, పశ్చిమబెంగాల్(west bengal) తదితర రాష్ట్రాలకు ఆదివారం సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే తమిళనాడులో రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. బీజేపీ, టీవీకే పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలున్నట్లు ప్రచారం నడుస్తోంది. పొత్తులో భాగంగా తమిళ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్‌కు బీజేపీ డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. టీవీకేతో పొత్తుకు సంబంధించి చర్చలు తుది దశకు చేరుకున్నాయని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read: అసోం ఎన్నికలు.. రెండో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్
BJP Offers Deputy CM Post To Vijay
అంతేకాదు పొత్తులో భాగంగా టీవీకేకు 80 సీట్లు ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చినట్లు తెలిపాయి. హైకమాండ్ విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఆఫర్ ఇస్తే విజయ్ సీఎం పదవిపై ఫోకస్ పెట్టినట్లు చెప్పాయి. ఇరు పార్టీల చర్చల్లో ఈ విషయం కీలకంగా మారినట్లు పేర్కొన్నాయి. కానీ పొత్తుకు సంబంధించి ఇప్పటివరకు ఇరు పార్టీల నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే గతంలో బీజేపీ, డీఎంకే పార్టీలతో పొత్తు పొట్టుకోమని విజయ్ తేల్చిచెప్పిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా ఈ పొత్తు అంశంపై వార్తలు వస్తూనే ఉన్నాయి.
Also Read: బెంగాల్ సహా ఐదు రాష్ట్రాల్లో పోలింగ్ ? నేడు తేదీలను ప్రకటించనున్న ఎన్నికల కమిషన్
Follow Us