J&K: లోయలో పడిన ఆర్మీ వెహికల్...ఐదుగురు జవాన్లు మృతి

జమ్మూ–కాశ్మీర్‌‌లో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఇది అదుపు తప్పి 350 అడుగుల లోయలో పడిపోయనట్లు తెలుస్తోంది. దీనిలో ప్రయాణిస్తున్న ఐదుగురు జవాన్లు మృతి చెందారు. మిగతావారు గాయాలతో బయటపడ్డారు. 

author-image
By Manogna alamuru
New Update
vehicle

Army Vehicle Photograph: (Google)

జమ్మూ–కాశ్మీర్‌‌లో ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఇది అదుపు తప్పి 350 అడుగుల లోయలో పడిపోయనట్లు తెలుస్తోంది. దీనిలో మొత్తం 18 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో ఐదుగురు జవాన్లు మరణించగా...మిగతావారు తీవ్ర గాయాలపాయ్యారు. మెంధార్ లోని బాల్నోయ్ ప్రాంతంలోకి ఆర్మీ వాహనం దూసుకెళ్ళింది. వెహికల్ పడిపోయిన చోటికి సహాయక బృందాలు చేరుకున్నాయి. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆర్మీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

ఇలాంటి ఘటనే నవంబర్‌ 4న కూడా చోటు చేసుకుంది. రాజౌరీ జిల్లాలోని బడాగ్ ప్రాంతంలో సైనిక వాహనం లోయలో పడింది. దీనిలో ఒకరు  మృతి చెందగా మరొకరికి తీవ్రంగా గాయాలయ్యాయి. 

Also Read: Ukraine: వెంటాడి వేటాడిన కీవ్ డ్రోన్స్..పరుగులు పెట్టిన కిమ్ సైనికులు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు