/rtv/media/media_files/2026/05/13/air-india-2026-05-13-17-38-06.jpg)
Air India to cut international flights amid airspace restrictions, high fuel costs
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులను తగ్గించడంతో పాటు కొన్ని విదేశీ మార్గాల్లో సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల వల్ల విమానయాన ఇంధన ధరలు పెరగడం, గగనతల ఆంక్షల వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ సంస్థ తెలిపింది. ముఖ్యంగా 6 ప్రధాన మార్గాల్లో విమాన సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామని వెల్లడించింది. ఇందులో ఢిల్లీ-చికాగో, ముంబై-న్యూయార్క్, ఢిల్లీ-షాంఘై, చెన్నై-సింగపూర్, ముంబై-ఢాకా, ఢిల్లీ-మాలే రూట్లు ఉన్నాయి. ఆగస్టు వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ఎయిర్ లైన్ స్పష్టం చేసింది.
Also Read: గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్.. ఇంట్లో ఉన్న మీ బంగారానికి వడ్డీ.. మోదీ సంచలన స్కీమ్!
ఇంధన ధరలు పెరగడం,గగనతల ఆంక్షల వల్ల విమానాలను నడపడం ఆర్థికంగా భారంగా మారిందని ఎయిర్ ఇండియా తెలిపింది. వాణిజ్యపరంగా ఈ సర్వీసులు లాభదాయకంగా లేవని చెప్పింది. సర్వీసుల తగ్గింపు ఉన్నాకూడా ప్రతి నెలా 1,200 కంటే ఎక్కువ అంతర్జాతీయ విమానాలను నడుపుతామని ఎయిర్ ఇండియా తెలిపింది. ఇందులో భాగంగా ఉత్తర అమెరికాకు వారానికి 33, యూరప్‌కు 47, యూకేకు 57, ఆస్ట్రేలియాకు 8 విమానాలు నడిపిస్తామని తెలిపింది. అలాగే ఆగ్నేయాసియా, సార్క్ దేశాలకు వారానికి 158 విమానాలు, ఆఫ్రికాలోని మారిషస్‌కు వారానికి 7 విమాన సర్వీసులను కొనసాగించనున్నట్లు పేర్కొంది.
Follow Us