/rtv/media/media_files/ZMpt3ayx9zWic4jm5GyU.jpg)
telangana jagruthi kavitha
Kavitha : తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆమెకు కోర్ట భారీ ఊరటనిచ్చిన విషయం తెలిసిందే. దీనిపై డిశ్చార్జ్ పిటిషన్లు అనుమతి ఇస్తూ ఇటీవల కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్వకుంట్ల కవిత మరోసారి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టుకు వెళ్లారు. ఈ సందర్భంగా కోర్టు రిజిస్టర్‌లో కవిత వేలిముద్రలు నమోదు చేశారు. సీబీఐ కేసు నుంచి డిశ్చార్జ్ పిటిషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారంతా కోర్టులో వేలిముద్రలు నమోదు చేయాల్సి ఉండటంతో ఆమె కూడా ఢిల్లీ కోర్టుకు వచ్చారు. రిజిస్టర్‌లో కవిత వేలిముద్రలు నమోదు చేసిన అనంతరం అక్కడినుంచి ఆమె తిరగి హైదరాబాద్‌కు బయల్దేరారు.
కాగా ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మద్యం టెండర్ల విషయంలో కుంభకోణం జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ మంత్రి మనీస్ సిసోడియా సహా మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై సీబీఐ అభియోగాలు మోపింది. అయితే కేసును విచారించిన రౌస్ అవెన్యూ కోర్టు కేసులో కవితకు భారీ ఊరట లభించేలా తీర్పునిచ్చింది. ఈ కేసులో మొత్తం 23 మందిపై ఉన్న అభియోగాలను తొలగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. ఈ కేసు విచారణ సందర్భంగా న్యాయస్థానం దర్యాప్తులో పలు లోపాలు ఉన్నాయని సీబీఐని తప్పుబట్టింది. కేసు నమోదు, దర్యాప్తులో సీబీఐ అనుసరించిన విధానాన్ని కూడా కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. 45 రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం అనంతరం నిందితులకు క్లీన్ చిట్ ఇస్తున్నట్లు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
Follow Us