IND vs PAK : ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్.. తండేల్ స్టోరీ రిపీట్!

ఇవాళ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్  జరగనుంది. ఈ సందర్బంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ లోని కరాచీ జైలులో మగ్గుతున్న 22 మంది భారత జాలర్లను అక్కడి ప్రభుత్వం  విడుదల చేసింది. ఇటీవల ఇదే కథాంశంతో తండేల్ చిత్రం తెరకెక్కింది.

New Update
india fishermans

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా, పాకిస్థాన్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్  జరగనుంది. ఈ సందర్బంగా కీలక పరిణామం చోటుచేసుకుంది. పాకిస్థాన్ లోని కరాచీ జైలులో మగ్గుతున్న 22 మంది భారత జాలర్లను అక్కడి ప్రభుత్వం  విడుదల చేసింది. 202122 లో తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారని ఆరోపిస్తూ పాక్ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు.  22 మందిలో 18 మంది గుజరాత్, 3 డయ్యూ, ఒకరు ఉత్తరప్రదేశ్ కు చెందినవారు ఉన్నారు.  విడుదలైన మత్స్యకారులను వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించారు.  

విడుదలైన ప్రతి జాలరికి ఈధీ ఫౌండేషన్ ద్వారా పాక్ రూ. 5 వేలు, బహుమతులను అందించింది.  విడుదలైన వారిలో భూపత్, మాలా, క్రిషన్, ఖలాఫ్, మోహన్, ఆసిఫ్, అశోక్, అక్బర్, లక్ష్మణ్, మోజీ, దీపక్, రామ్, హరి, తపు, సురేష్, విజయ్, మనోజ్ కుమార్, విను, మహేష్, సుభాష్, సంజయ్, సెలెంధర్ ఉన్నారు. జనవరి 23న కరాచీ జైలులో ఒక భారతీయ మత్స్యకారుడు మరణించాడు. గత 2 సంవత్సరాలలో, పాకిస్థాన్ మరణించిన 8వ భారతీయ జాలరి ఇతను.  

సముద్ర సరిహద్దులను పొరపాటున దాటే మత్స్యకారుల పట్ల భారతదేశం, పాకిస్తాన్ రెండు దేశాలు కరుణాపూరిత విధానాన్ని అవలంబించాలని ఈధీ ఫౌండేషన్ అధిపతి ఫైసల్ ఈధీ కోరారు.  కాగా జనవరి 1, 2025న భారత్, పాకిస్తాన్ మధ్య పంచుకున్న తాజా ఖైదీల మార్పిడి జాబితాల ప్రకారం  పాకిస్తాన్ 217 మంది మత్స్యకారులతో సహా 266 మంది భారతీయ ఖైదీలను నిర్బంధించింది, భారత్ 81 మంది మత్స్యకారులతో సహా 462 మంది పాకిస్తానీ ఖైదీలను నిర్బంధించింది. 

ఇదే కథాంశంతో తండేల్ చిత్రం

కాగా ఇటీవల నాగచైతన్య హీరోగా చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కిన తండేల్ చిత్రం కూడా ఇదే కథాంశంతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది.  సాయిపల్లవి హీరోయిన్ గా నటించింది. 

Also Read :  Champions Trophy: నేడే ప్రత్యర్ధితో పోరు..గత ఫైనల్ ప్రతీకారం భారత్ తీర్చుకుంటుందా..

 

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు