Hot Sweet Potato: చలికాలంలో వేడివేడి చిలగడదుంప తింటే?

చిలకడదుంపలో ఫైబర్ అధికంగా ఉంటుంది. చిలగడదుంపలను ఉడకబెట్టడం, ఆవిరిలో ఉడికించడం లేదా కాల్చడం వంటి అనేక విధాలుగా తినవచ్చు. చలికాలంలో దీనిని సూపర్‌ ఫుడ్‌ అంటారు.ఊబకాయం, మధుమేహంతో బాధ పడుతున్నట్లయితే చిలగడదుంప తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

New Update
Hot Sweet Potato

Hot Sweet Potato Photograph

Hot Sweet Potato: చలికాలం వచ్చిందంటే ప్రజలు వేడివేడి ఆహార పదార్థాలు తినేందుకు మక్కువ చూపుతారు. చిలకగడదుంపను కొందరు కాల్చి తింటారు. మరికొందరు ఉడకబెట్టి తింటారు. చిలగడదుంపలు తినడానికి రుచికరమైనవి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివి. ఇందులో చాలా పోషకాలు ఉన్నాయి. ఇవి శరీరానికి మేలు చేస్తాయి. స్వీట్‌ పొటాటోలో కార్బోహైడ్రేట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందుకే వైద్యులు కూడా చిలగడదుంపలను తినమని సిఫార్సు చేస్తారు.

జీవక్రియను వేగవంతం:

ఇందులో విటమిన్ ఎ మంచి మోతాదులో లభిస్తుంది. కాబట్టి దాని ఫైబర్ జీవక్రియను వేగవంతం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో కార్బోహైడ్రేట్లు, జింక్, మెగ్నీషియం ఉంటాయి. మనలో చాలామంది చిలగడదుంపలను ఇష్టపడి తింటారు. అయితే వేడిగా ఉన్నప్పుడు తినాలా లేక చల్లగా తినాలన్నదానిపై ప్రజలు తరచుగా గందరగోళానికి గురవుతారు. చలికాలంలో ఇది వేడిగానే తినాలి. ఇందులో విటమిన్ సి మంచి మొత్తంలో ఉంటుంది. రోగనిరోధకశక్తిని బలపరుస్తుంది. ఫ్లూ వంటి సమస్యల నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా శరీరానికి వేడిని కూడా అందిస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే చిలగడదుంపలు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.

ఇది కూడా చదవండి: వాటర్ హీటర్ వాడేప్పుడు ఈ పొరపాట్లు చేయొద్దు

ఆహారాన్ని జీర్ణించుకోలేకపోతే చిలగడదుంపను ఆహారంలో చేర్చుకోవాలి. చలికాలంలో వ్యాయామం చేయడానికి ప్రజలు చాలా బద్ధకంగా ఉంటారు. అటువంటి పరిస్థితిలో బరువు చాలా త్వరగా పెరుగుతుంది. కాబట్టి ఆహారంలో దీన్ని చేర్చుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఈ పండును తినడం ద్వారా త్వరగా ఆకలి వేయదు. అతిగా తినకుండా ఉంటారు. రాత్రిపూట చిలగడదుంప తినడం మానుకోవాలి. ప్రత్యేకించి ఊబకాయంతో లేదా మధుమేహంతో బాధ పడుతున్నట్లయితే చిలగడదుంప తినడానికి ఉత్తమ సమయం మధ్యాహ్నం 12 నుంచి 3 గంటల వరకు. చిలగడదుంపలను ఉడకబెట్టడం, ఆవిరిలో ఉడికించడం లేదా కాల్చడం వంటి అనేక విధాలుగా తినవచ్చు. చలికాలంలో దీనిని సూప్‌గా కూడా తీసుకోవచ్చు.

గమనికఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: ఈ 8 అలవాట్లు మీ విలువను తగ్గిస్తాయి

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు