/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Why-celebrate-Holi.-What-is-the-significance-jpg.webp)
Holi
దేశంలో హోలీ పండుగను గత దశాబ్ధాల నుంచి మాత్రమే జరుపుకోవడం లేదు. ఎన్నో శతాబ్దాల నుంచి హోలీ పండుగను దేశంలో జరుపుకుంటున్నారు. ఒక్కసారి వెనక్కి చరిత్రలోకి వెళ్తే.. మౌర్యుల కాలం నుంచి మొఘల్ కాలం వరకు హోలీ పండుగను జరుపుకున్నట్లు పురాణాలు చెబుతున్నాయి. మౌర్యుల కాలంలో హోలీ పండుగను ఘనంగా జరుపుకునేవారు. ఆ సమయంలో హోలీని వసంతోత్సవ్ లేదా కామ మహోత్సవ్ అని పిలిచేవారు.
ఇది కూడా చూడండి: Horoscope Today: నేడు ఈ రాశి వారు అతిగా మాట్లాడకుండా ఉంటే బెటర్!
మౌర్యుల కాలంలో కూడా హోలీ పండుగను..
చంద్రగుప్త మౌర్యుడు హోలీ (Holi 2025) ని డ్యాన్స్, పాటలు, అబిర్ గులాల్ విసురుతూ జరుపుకునేవారట. అలాగే మొఘల్ కాలంలో హోలీని ఇంకా వైభవంగా జరుపుకునేవారు. మొఘల్ వంశ స్థాపకుడు బాబర్ హోలీ పండుగను జరుపుకున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి. ఈ హోలీ పండుగను బాబర్ తర్వాత అక్బర్, ఫతేపూర్ సిక్రీ కూడా ఆగ్రాలో ఘనంగా జరుపుకున్నారు.
ఇది కూడా చూడండి: హరిహర వీరమల్లు మరోసారి వాయిదా.. ప్రకటించిన మేకర్స్ !
కుటుంబాలతో ఎంతో సంతోషంగా రంగులు చల్లుతూ హోలీ పండుగను జరుపుకునేవారట. అయితే షాజహాన్ పాలనలో రాజరిక పద్ధతిలో హోలీ పండుగను జరుపుకున్నారు. ఎర్రకోట వద్ద ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి.. సంగీతం, నృత్యంతో హోలీని జరుపుకునేవారట. ఆ తర్వాత చివరి మొఘల్ పాలకుడు ఔరంగజేబు కాలంలో హోలీ పండుగ మసకబారింది. ఔరంగజేబు మతపరమైన అభిమాని కావడంతో.. హిందూ పండుగలపై ఆంక్షలు విధించారు. దీంతో పెద్దగా హోలీ పండుగను ఘనంగా జరుపుకోలదట.
ఇది కూడా చూడండి: Russia-Trump: ఒప్పందం పై పుతిన్ అనుకూల వ్యాఖ్యలు..ఒకవేళ తిరస్కరిస్తే అంటున్న ట్రంప్!
Hola Mohalla was initiated by Guru Gobind Singh Ji as a unique celebration for Sikhs to observe instead of the traditional Hindu festival of Holi. This annual event serves as a gathering for Sikhs to engage in martial arts, military exercises, and mock battles. pic.twitter.com/c5IxDJavJi
— Jaspinder Kaur Udhoke (@udhokes) March 14, 2025