TGPSC: తెలంగాణ గ్రూప్-4 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు ఇచ్చిన రేవంత్ సర్కార్ ఇంకా జాయినింగ్ ఆర్డర్స్ ఇవ్వకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఆర్డర్లు తీస్కొని 45 రోజులు గడుస్తున్న తమను విధుల్లోకి తీసుకోవట్లేదని వాపోతున్నారు. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనల్ సోసైటీ (TMREIS) సంస్థ జాయినింగ్ ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గ్రూప్-4లో 99 డిపార్ట్మెంట్స్ ఉండగా 98 శాఖలకు పోస్టింగ్స్ అండ్ ఆర్డర్లు ఇచ్చారు. కానీ TMRIES శాఖకు చెందిన అభ్యర్థులకు ఇంకా కౌన్సెలింగ్ నిర్వహించలేదు. దీంతో తమ పరిస్థితి ఏమిటని? ఇంకెప్పుడు ఉద్యోగాలు కేటాయిస్తారంటూ ప్రజాభవన్‌లో ప్రజావాణికి అభ్యర్థులు ఫిర్యాదు చేశారు. Also Read: అవినీతిని ప్రశ్నించాడని సర్పంచ్‌ను చంపించిన మంత్రి.. అతను అరెస్ట్! tgpsc group 4 Photograph: (tgpsc group 4) సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు.. ఈ మేరకు 2024 డిసెంబర్ 4న పెద్దపల్లిలో ప్రభాపాలన విజయోత్సవాల్లో భాగంగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా వీరందరికీ నియామక పత్రాలు అందించారు. కానీ ఇంతవరకు విధుల్లోకి తీసుకోకపోవడంతో శుక్రవారం ప్రజా భవన్‌కు తరలివచ్చిన 191 అభ్యర్థులు వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. తామంతా ఒక నెల జీతం కోల్పోవడం జరిగిందని, తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని కారణాలు ఏమైనా తొందరగా క్లియర్ చేసి జూనియర్ అసిస్టెంట్స్‌ను విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. TGPSC Notification ఇది కూడా చదవండి: ఏం చేద్దాం నాన్నా.. కేసీఆర్ తో కేటీఆర్ కీలక భేటీ! TMRIES శాఖకు 191 మంది అర్హత.. అయితే దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు సంబంధిత అధికారులకు ఫోన్ చేసి సమాచారాన్ని తెలుసుకోగా.. విధుల్లోకి ఎప్పుడు తీసుకుంటారనేది స్పష్టం చేయలేయకపోవడంపై అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ శాఖలో 191 మంది అర్హత సాధించిన అభ్యర్థులున్నామని, ఆయా జిల్లాల వారీగా త్వరగా కౌన్సెలింగ్ జరిపి పోస్టింగ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇది కూడా చదవండి: Viruska: మరోసారి ఆ సాధువును కలిసిన విరుష్క జోడీ.. మళ్లీ అదే కారణమట! Also Read: యూపీలో దారుణం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు హత్య