AP Govt Jobs 2025: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ అదిరిపోయే శుభవార్త.. 26,263 ఉద్యోగాలకు నోటిఫికేషన్!

నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ భారీ శుభవార్త చెప్పనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 26,263 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దశలవారిగా ఈ ఖాళీలను భర్తీ చేయనుండగా మొదటి దఫాలో 8వేలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 

New Update
11

AP CM Chandrababu

AP Govt Jobs 2025: నిరుద్యోగులకు చంద్రబాబు సర్కార్ భారీ శుభవార్త చెప్పనుంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖలో 26,263 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసింది. దశలవారిగా ఖాళీలను భర్తీ చేయనుండగా మొదటి దశలో 8వేలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 

వివరాలు సేకరించిన ప్రభుత్వం.. 

ఈ మేరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్, డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, ఆయుష్, జాతీయ ఆరోగ్య మిషన్ ఖాలీలను ఇప్పటికే సేకరించిన ప్రభుత్వం..1,02,125 ఉద్యోగాలలో 3,114 వైద్యులు, 23,149 పారామెడికల్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఆయుష్ కింద ఆయుర్వేద, హోమియో, యునాని హాస్పిటల్స్ సేవలందిస్తుండగా ఇందులో 825 పోస్టులకు 407 ఖాళీగా ఉన్నాయి. కాంపౌండర్లు, అటెండర్లతో కలిపి 1601 ఉద్యోగాలు భర్తీ చేయగా 1131 పోస్టులు ఖాలీగా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: Saif Ali Khan: సైఫ్ ను కోటి డిమాండ్ చేసిన దుండగుడు.. వెలుగులోకి సంచలన నిజాలు

ఇక విజయవాడ జీజీహెచ్‌లో 314 వైద్య పోస్టులకు 46 వెకెన్సీలున్నాయి. మెడికల్, సర్జికల్ ఆంకాలజీ డిపార్ట్ మెంట్ లో 4 డాక్టర్ పోస్టులున్నాయి. బోధనా ఆస్పత్రుల్లో 5749 వైద్యుల ఉద్యోగాలు భర్తీ చేయగా 1484 ఖాళీగానే ఉన్నాయి. గుంటూరు జీజీహెచ్‌లో 65 వైద్య పోస్టులు, క్లీనికల్ డిపార్టుమెంట్ లో 14, నాన్ క్లినికల్ 19, సూపర్ స్పెషాలిటీలో 38 ఉద్యోగాలు భర్తీ చేయాల్సివుంది. ఈ 3 డిపార్టుమెంట్లలో ప్రొఫెసర్ 17, అసోసియేట్ ప్రొఫెసర్ 10 ఖాళీగా ఉన్నాయి. మరో 78 రెసిడెంట్ పోస్టులతోపాటు పీహెచ్‌సీలు, జిల్లా, సామాజిక, ప్రాంతీయ హాస్పిటల్ లో 708 డాక్టర్ పోస్టులున్నాయి. వీటిల్లో 9,978 పారామెడికల్ ఉండగా ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ, నర్సులకు సంబంధించిన జాబ్స్ ఉన్నాయి.

ఇది కూడా చదవండి: NEET: నీట్ UG పరీక్షపై NTA సంచలన నిర్ణయం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు