విమానంలో విషాద ఘటన.. మహిళ మృతి.. మృతదేహంతోనే ప్రయాణం

విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విషాదం జరిగింది. ఓ ప్రయాణికురాలు మృతి చెందడం కలకలం రేపింది. హాంగాంగ్ నుంచి లండన్‌ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

New Update
Woman Dies Soon After Takeoff On British Airways Flight

Woman Dies Soon After Takeoff On British Airways Flight

విమానం టేకాఫ్ అయిన కాసేపటికే విషాదం జరిగింది. ఓ ప్రయాణికురాలు మృతి చెందడం కలకలం రేపింది. హాంగాంగ్ నుంచి లండన్‌ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించకుండానే 13 గంటల పాటు ప్రయాణికులతో పాటు ఆ మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానం 331 మంది ప్రయాణికులతో హాంకాంగ్ నుంచి లండన్‌కు బయలేదరింది. గంట సమయం తర్వాత అందులో ఉన్న ఓ 60 ఏళ్ల ప్రాణాలు కోల్పోయింది. ఆమెతో అందులోనే ఉన్న కుటుంబ సభ్యుల సహకారంతో మృతదేహాన్ని బాత్రుంలో ఉంచాలని విమాన సిబ్బంది అనుకున్నారు. 

Also Read: కేరళలో మరో ప్రాణాంతక వ్యాధి.. 12 మందికి సోకిన వైరస్.. భయాందోళనలు స్థానికులు

కానీ ఆ కుటుంబ సభ్యులు ఒప్పుకోకపోవడంతో మృతదేహాన్ని ఫ్లైట్‌ వెనుక భాగంలోని గ్యాలీకి తగిలించారు. గ్యాలీ ఫ్లోర్‌ వేడిగా ఉండటం వల్ల కొన్ని గంటల తర్వాత మృతదేహం నుంచి దుర్వాసన వచ్చిందని ప్రయాణికులు చెప్పారు. విమానం లండన్‌లో ల్యాండ్ అయిన తర్వాత దర్యాప్తు కోసం మరో 45 నిమిషాల పాటు తమ సీట్లలోనే ఉండాలని అధికారులు ఆదేశించారని చెప్పారు.  

Also Read: ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్.. అణు పరిశోధన కేంద్రంపై దాడులు

ఇంటర్నేషనల్ విమాన రవాణా సంఘం (IATA) గైడ్‌లైన్స్‌ ప్రకారం.. విమానం గాల్లో ఉన్నప్పుడు ప్రయాణికుడు చనిపోతే దాన్ని ఎమర్జెన్సీ వైద్య పరిస్థితిగా పరిగణించరని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఇలాంటి సందర్భాల్లో మృతదేహాన్ని బాడీ బ్యాగ్‌లో ఉంచి, విమానంలో ఖాళీగా ఉండే ప్రాంతానికి తీసుకెళ్తారని చెప్పింది. ఒకవేళ విమానం పూర్తిగా నిండిపోతే మృతదేహాన్ని సీటులోనే ఉంచుతారని క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ ఘటనలో తమ సిబ్బంది రూల్స్‌ను పాటించారని పేర్కొంది.

Advertisment
తాజా కథనాలు