America: క్రిస్మస్ వేళ ఉక్రెయిన్ లోని పలు విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా భీకర దాడులు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే మాస్కో దాడుల నుంచి కీవ్ ను రక్షించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని చెప్పారు.దీని పై ఇప్పటికే తాను రక్షణ మంత్రిత్వశాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. Also Read: Viajyawada: డిసెంబర్‌లోనే తాటి ముంజలు, మామిడి పండ్లు..ఏపీలో విచిత్రం! Ukraine - Joe Biden ఉక్రెయిన్ ప్రజలు చలి నుంచి రక్షణ పొందకుండా ఉండడమే రష్యా దాడి వెనుక మెయిన్ లక్ష్యమని తెలుస్తుంది.గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి వారికి విద్యుత్ సరఫరా అందకుండా మాస్కో కుట్ర పన్నింది అని పేర్కొన్నారు.మరికొన్ని రోజుల్లో బైడెన్ అధ్యక్ష పీఠం నుంచి వైదొలగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ట్రంప్ అధికారంలోకి వచ్చేనాటికి ఉక్రెయిన్ మరింత ఎక్కువ సాయం అందించాలనే ఉద్దేశంతో బైడెన్ సర్కారు వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. Also Read: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్, కంప్యూటర్ ఆపరేటర్ మృతి..ఎస్సై అదృశ్యం! ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించగా..దానికి అదనంగా మరో 988 మిలియన్ డాలర్ల ఆయుధ సామాగ్రిని ఇస్తామని బైడెన్ కార్యవర్గం హామీ ఇచ్చింది. అమెరికా నుంచి కీవ్ కు 2022 నుంచి ఇప్పటి వరకు 62 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు ఇతర సాయం కూడా అందించారు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ పై రష్యా దాడులను తీవ్రతరం చేసింది. Also Read: AP Weather: దిశ మార్చుకున్న అల్పపీడనం..ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు దీనికి తోడు ఉత్తర కొరియా దళాలు మాస్కోకు సాయం అందిస్తుంది.దీంతో కీవ్ తనను రక్షించుకునేందుకు బైడెన్ కార్యవర్గం పెద్దమొత్తంలో ఆయుధాలను అందిస్తోంది. ఇక క్రిస్మస్ పర్వదినాన ఉక్రెయిన్ దేశంలోని పలు విద్యుత్ కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని రష్యా దాడులు నిర్వహించింది. Also Read: TG:కానిస్టేబుల్ శృతి, నిఖిల్ మృతిలో బిగ్ ట్విస్ట్..ఎస్సై మృతదేహం లభ్యం 70 కి పైగా క్షిపణులు , 100 కు పైగా డ్రోన్లతో విరుచుకుపడినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. అందులో 50 క్షిపణులను ,పలు డ్రోన్లను తమ సేనలు కూల్చివేసినట్లు వెల్లడించారు.