అమెరికా సైన్యాన్ని బూడిద చేస్తాం.. ఇరాన్ సంచలన హెచ్చరిక

ఇరాన్ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాగేర్‌ గాలిబఫ్‌  సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలకు సిద్ధమని నటిస్తూ.. రహస్యంగా భూతల దాడులకు సన్నాహాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. అమెరికా దళాలను బుడిద చేస్తామని హెచ్చరించారు.

New Update
Iran parliament Speaker

Iran parliament Speaker

పశ్చిమాసియాలో యుద్ధం ముదురుతూనే ఉంది. తాజాగా ఇరాన్ పార్లమెంట్‌ స్పీకర్‌ మహమ్మద్‌ బాగేర్‌ గాలిబఫ్‌  సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చర్చలకు సిద్ధమని నటిస్తూ.. రహస్యంగా భూతల దాడులకు సన్నాహాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తమ సైనికులు అమెరికా దళాల కోసం ఎదురుచూస్తున్నారని.. వాళ్లు అడుగుపెట్టగానే బుడిద చేస్తామని హెచ్చరించారు. అంతేకాదు అమెరికా మిత్రదేశాలను కూడా టార్గెట్ చేసుకుంటామన్నారు. 

Also Read: దూసుకుపోతున్న మహిళలు.. పురుషుల కన్నా ఎక్కువ జీతాలు వీళ్లకే.. రిపోర్టులో సంచలన విషయాలు

 అమెరికాకు చెందిన 3500 మంది మెరైన్లు ఆదివారం సెంట్రల్ కమాండ్ పరిధిలోకి రానున్నారు. మరోవైపు ఇరాన్‌ చమురు ఉత్పత్తికి అత్యంత కీలకమైన ఖర్గ్ ద్వీపాన్ని అమెరికా స్వాధీనం చేసుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దీనిపై స్పందించిన ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ ట్రంప్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధి ఫాతేమ్ మొహజిరానీ సైతం ఈ వ్యవహారంపై స్పందించారు. తాము యుద్ధం ప్రారంభించలేదన్నారు. ఈ యుద్ధంలో తీవ్రంగా నష్టపోతున్న దేశం కూడా తమదేనన్నారు. ఏ చర్చలు జరిగినా కూడా నష్టపరిహారానికి సంబంధించిన అంశాన్ని కచ్చితంగా మాట్లాడాలని పేర్కొన్నారు. అలాగే హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణ ఉండటం, ఆంక్షలు తొలగింపు లాంటివి కూడా చర్చల్లో కీలక విషయాలని తెలిపారు. తాము శాంతి కోసం అడుగులు వేస్తున్నట్లు స్పష్టం చేశారు.

Also Read: పశ్చిమాసియాకు చేరుకున్న అమెరికా బలగాలు.. ఇక భూతల పోరు తప్పదా?

ఆదివారం ఉదయం కూడా ఇరాన్‌పై భారీ స్థాయిలో దాడులు జరిగాయి. ఈ దాడుల్లో కొందరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. ఇజ్రాయెల్ కూడా దీనిపై స్పందించింది. తాత్కాలిక కమాండ్ సెంటర్, ఆయుధ తయారీ కేంద్రంపై ఈ దాడులు జరిగినట్లు తెలిపింది. ఇరాన్‌ విద్యుత్ కేంద్రాలపై, చమురు సదుపాయలపై మరో 10 రోజుల వరకు దాడులు చేయమని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ కూడా దాడులు కొనసాగుతూనే ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శాంతి చర్చల కోసం ప్రయత్నాలు విఫలమవుతున్నట్లే కనిపిస్తున్నాయి. 

Advertisment
తాజా కథనాలు