Iran War: ఇరాన్‌కు కోలుకోలేని దెబ్బ.. మిస్సైల్‌ ప్లాంట్‌ను ధ్వంసం చేసిన అమెరికా

ఇరాన్‌లోని కరాజ్‌ నగరంలో సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణి తయారీ కేంద్రంపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఆ మిస్సైల్ ప్లాంట్‌ పూర్తిగా ధ్వంసమైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.

New Update
US Releases Before-And-After Photos Of Iran’s Karaj Missile Plant Hit During Operation Epic Fury

US Releases Before-And-After Photos Of Iran’s Karaj Missile Plant Hit During Operation Epic Fury

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌లోని కరాజ్‌ నగరంలో సర్ఫేస్-టు-సర్ఫేస్ క్షిపణి తయారీ కేంద్రంపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఈ దాడుల్లో ఆ మిస్సైల్ ప్లాంట్‌ పూర్తిగా ధ్వంసమైనట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ఈ ప్లాంట్‌లో బాలిస్టిక్ మిస్సైల్స్‌ను అసెంబుల్ చేసేందుకు వినియోగించేవారని తెలిపింది. 

Also Read: ఇరాన్‌ యురేనియం శుద్ధి చేయలేదు.. యుద్ధం అనుకున్నదాని కన్నా ముందుగానే ముగుస్తుంది: నెతన్యాహు

తమ దాడులు ఈ ప్లాంట్‌ పూర్తిగా నెలమట్టమైనట్లు స్పష్టం చేసింది. దాడి జరగకముందు, దాడి జరిగిన తర్వాత ఆ ప్లాంట్‌కు సంబంధించిన ఏరియల్ ఫొటోలను కూడా విడుదల చేసింది. అయితే కరాజ్ ప్లాంట్ ధ్వంసం కావడంతో ఇరాన్ సైనిక సామర్థ్యం మరింత బలహీన పడే ఛాన్స్ ఉంది. అంతేకాదు గల్ఫ్‌ ప్రాంతంలో వాణిజ్య నౌకయానానికి కూడా ముప్పు తగ్గనుంది. మరోవైపు ఇరాన్‌ కూడా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది.  

Also Read: వీధిలో ఉమ్మినందుకు ఇద్దరు భారతీయులకు రూ.3.5 లక్షల జరిమానా

అలాగే సౌదీ అరేబియా, ఖతర్‌లో గ్యాస్ కేంద్రాలపై దాడులు చేస్తోంది. ఈ దాడుల వల్ల ఇంధన ధరలు పెరిగిపోతున్నాయి. గ్యాస్‌ ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. మరోవైపు హర్ముజ్‌ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యం కొనసాగుతోంది. ఆ రూట్‌ గుండా వచ్చే నౌకలపై ఇరాన్ దాడులు చేయడంతో తీవ్ర అంతరాయం నెలకొంది.  ప్రపంచ ఇంధన సరఫరా గొలుసు దెబ్బతినకుండా ఉండేందుకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ దేశాలు ఏకమయ్యాయి. హర్ముజ్ జలసంధిలో నౌకలు సురక్షితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకునేందుకు తాము రెడీగా ఉన్నామని ప్రకటించాయి.

Advertisment
తాజా కథనాలు