/rtv/media/media_files/2026/03/16/trump-2026-03-16-17-35-03.jpg)
Trump Wants To Capture Iran’s ‘Crown Jewel’ Kharg Island
ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు కీలమైన ఖర్గ్ ఐలాండ్‌పై ఇటీవల అమెరికా దాడులు చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో అక్కడ చాలా భాగం ధ్వంసమైనట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే చెప్పారు. అయితే ఇప్పుడు ట్రంప్ రూట్ మారింది. ఏకంగా ఆ ఐలాండ్‌నే స్వాధీనం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు యాక్సియోస్ అనే న్యూస్ ఏజెన్సీ తమ కథనంలో వెల్లడించింది. హర్ముజ్‌లో అంతరాయం ఇలాగే కొనసాగితే ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునే దిశగా అమెరికా దళాలు ముందుకెళ్లనున్నట్లు తెలుస్తోందని పేర్కొంది.
యాక్సియోస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకునేందుకు గ్రౌండ్ ఆపరేషన్‌కు సంబంధించి అధ్యక్షుడు ట్రంప్ ఇంకా నిర్ణయం తీసుకోలేదని వైట్‌హౌస్ సీనియర్ అధికారి తెలిపారు. ఒకవేళ హర్ముజ్ జలసంధిని తెరిచే ప్రయత్నాలు ఆగిపోతే మాత్రం ఈ ఆలోచన మారొచ్చని చెప్పారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థకు ఈ ఐలాండ్ కీలకంగా ఉంది. అందుకే దాన్ని ఆక్రమించుకోవాలని ట్రంప్ యంత్రాంగం భావిస్తున్నట్లు మరో అధికారి తెలిపారు. అయితే ఖర్గ్‌పై దాడులు చేయడాన్ని ట్రంప్ మద్దతుదారులు సపోర్ట్ చేస్తున్నాయి. ఇరాన్ చమురు హబ్‌పై నియంత్రణ కోల్పోతే ఆ దేశం నాశనం అవుతుందని సెనెటర్ గ్రాహమ్ వ్యాఖ్యానించారు.
Also Read: హోటళ్లు, రెస్టారెంట్లకు భారీ ఊరట.. కమర్షియల్ సిలిండర్ల కేటాయింపు ప్రారంభం
అయితే ఈ గ్రౌండ్ ఆపరేషన్ నాలుగు దశల్లో జరిగే ఛాన్స్ ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ముందుగా ఐలాండ్‌లో ఉన్నటువంటి రాడార్లు, గగనతల రక్షణ వ్యవస్థలు, యాంటీ షిప్ క్షిపణుల బ్యాటరీలపై దాడులు జరిగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత ద్వీపంలోని ఉత్తర భాగంలో ఉండే ఎయిర్‌స్ట్రిప్‌ను ఆక్రమించుకునే దానిపై ఫోకస్ పెడతాయి. దీన్ని స్వాధీనం చేసుకుంటే యూఎస్ బలగాలను సి 130 సూపర్ హెర్క్యులెస్, చినూక్ హెలికాప్టర్లతో తరలించే ఛాన్స్ ఉంటుంది. అనంతరం చమురు నిల్వ క్షేత్రాల లాంటి మౌలిక సదుపాయాలను స్వాధీనం చేసుకుంటాయి. ఇక చివరి దశలో లాండింగ్ ప్లాట్‌ఫామ్ డాక్స్ నుంచి మరిన్ని దళాలను తరలిస్తారు. మరోవైపు ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్‌లు కూడా ఇరాన్ నుంచి వచ్చే దాడులను పసిగట్టేందుకు సమీపంలో ఉన్న జలాల్లో గస్తీ కాస్తుంటాయి.
ఒకవేళ అమెరికా ఇలా గ్రౌండ్ ఆపరేషన్ చేస్తే ఆ తర్వాత ఇరాన్ ప్రతీకార దాడులకు దిగే ఛాన్స్ ఉంటుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్న చమురు పైప్‌లైన్లను, సౌదీ అరేబియాలో ఉన్న చమురు క్షేత్రాలపై దాడులు చేసే అవకాశాలున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి అమెరికా నిజంగానే ఖర్గ్ ఐలాండ్‌ను స్వాధీనం చేసుకుంటుందా ? లేదా ? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచిచూడాల్సిందే.
Also Read: కెనడాలో భారతీయ యువకుడిపై మూకుమ్మడి దాడి...పిడిగుద్దులు గుద్ది..వాహనం ఎక్కించి..
Follow Us