BIG BREAKING: యుద్ధం ఆపేస్తున్నా.. ట్రంప్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై 5 రోజుల పాటు ఎలాంటి దాడులు చేయబోమని పేర్కొన్నారు.

New Update
Trump

Trump

పశ్చిమాసియాలో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా సంచలన ప్రకటన చేశారు. ఇరాన్‌పై 5 రోజుల పాటు ఎలాంటి దాడులు చేయబోమని పేర్కొన్నారు. గత రెండ్రోజులుగా ఆయన ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, ఎనర్జీ ఫెసిలిటీస్‌ మీద జరపాల్సిన సైనిక దాడులు 5 రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జరుగుతున్న చర్చల విజయంపై యుద్ధం కొనసాగించాలా ? వద్దా ? అనేది ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు తన ట్రూత్‌ సోషల్‌లో ఈ పోస్టు చేశారు. 

ఇరాన్‌పై దాడులు 5 రోజుల పాటు ఆపివేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు తగ్గుతున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 13 శాతం వరకు పతనమై 96 డాలర్లకు చేరింది. ఈ ఒక్క ప్రకటన వల్లే 17 డాలర్లు తగ్గింది. మరోవైపు ట్రంప్ ప్రకటనపై ఇరాన్ కూడా స్పందించింది. తాము హెచ్చరించడంతోనే ఆయన దిగొచ్చినట్లు పేర్కొంది. ట్రంప్ తమ విద్యుత్ కేంద్రాలపై దాడులు చేస్తే హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసేస్తామని ఇటీవల ఇరాన్ హెచ్చరించింది. అలాగే ఇజ్రాయెల్‌కు చెందిన విద్యుత్ కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా ఇరాన్‌పై సైనిక దాడులు 5 రోజులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

Advertisment
తాజా కథనాలు