దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్.. దేశంలో ఎమర్జెన్సీ మార్షల్ లా ప్రకటించిన ఆరు గంటల్లోనే మళ్లీ ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఎమర్జెన్సీ యూన్ సుక్ యోల్ పదవికి చుట్టుకుంది. దేశంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలన్నీ అధ్యక్షుడి పదవికి వ్యతిరేకంగా పార్లమెంట్‌లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. దీనికి ఓటింగ్ జరగనుంది. ఇది కూడా చూడండి: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే! సపోర్ట్‌గా ఓటింగ్ వస్తే.. ఈ సమస్య నుంచి యూన్ సుక్ యోల్ బయటపడాలంటే పార్లమెంట్‌లో రెండు వంతుల సభ్యుల మద్దతు ఉండాలి. అలాగే తొమ్మిది మంది సభ్యులు ఉన్న రాజ్యాంగ కోర్టుకు చెందిన ఆరుగురు న్యాయమూర్తులు అధ్యక్షుడికి అనుకూలంగా ఓటు వేయాలి. డెమోక్రటిక్ పార్టీ, చిన్న పార్టీలు అన్ని కలిపి ప్రస్తుతం 192 మంది చట్టసభ్యులు ఉన్నారు. ఇప్పటికే అందరూ యూన్‌కి వ్యతిరేకంగా ఉన్నారు. వీరి నుంచి సపోర్ట్ రాకపోతే చివరకు యూన్ పదవీ పోవడం ఖాయమనే తెలుస్తోంది. ఇది కూడా చూడండి: రేపే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే! నార్త్ కొరియా కమ్యూనిస్టు దళాల ద్వారా సౌత్ కొరియాకు పొంచిఉన్న ముంపు నుంచి రక్షించేందుకు, దేశ వ్యతిరేక శక్తులను అంతం చేసేందుకు.. నేను ఎమర్జెన్సీ మార్షల్ లా ను ప్రకటిస్తున్నట్లు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ తెలిపారు. 2022లో మే యూన్ సుక్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్ష పార్టీ నియంత్రణలో ఉన్న జాతీయ అసెంబ్లీలో వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. ఇది కూడా చూడండి: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? దేశ ప్రజలను రక్షించేందుకు ఆయన ఎమర్జెన్సీ మార్షల్ లాను ప్రకటించారు. నియంత పార్క్ చుంగ్ హీ హత్య వల్ల 1979లో దేశంలో మార్షల్ లా అమలు చేశారు. ఆ తర్వాత మళ్లీ దీన్ని అమలు చేయడం ఇదే మొదటిసారి. ఇది కూడా చూడండి: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..!